ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం -రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలకు పెంపు


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరింట రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు.
 ఎన్నిక హామీలలో భాగంగా కాంగ్రేస్ పార్టి ఆరు గ్యారంటీలను  ప్రకిటించిందులో ఉచిత బస్సు ప్రయాణ పథకం తో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలకు పెంచిన పథకాలను శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

కాంగ్రేస్ పార్టి ఆరు గ్యారంటీలలో భాగంగా ఆర్టీసి బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  లాంచనంగా ప్రారంబించారు. సోనియా గాంధి ఇచ్చిన మాట ప్రకారం కార్యచరణ మొదలైందని ముఖ్యమంత్రి ట్వీట్ చేసారు. 
తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని ఆయనపేర్కొన్నారు.
 తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు తెలుపుతూ సోనియా గాంధి పుట్టిన రోజు సంక్షేమానికి ఇది మొదటి అడుగని అన్నారు.

మంత్రులు కొండా సురేఖ, సీతక్క  పచ్చజెండా ఊపి బస్సు ప్రయామం ప్రారంభించిన అనంతరం అసెంబ్లి నుండి టాంక్ బండ్ అంబేడ్కర్ భవన్ వరకు ముఖ్యమంత్రి సహా మంత్రులు అధికారులు ఎమ్మెల్యేలు ప్రయాణం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు