కాంగ్రెస్ విజయం సుస్థిర ప్రభుత్వ అవకాశాలు

 


ఈ సారి తెలంగాణాలో ప్రజల తీర్పు ఊహించిన విధంగానే ఉంది. టిఆర్ఎస్ పై  అసంతృప్తి కారణంగా అధికారం నుండి దింపి విపక్ష హోదా ఇస్తూ భారీగానే 39 ఎమ్మెల్యేలను గెలిపించారు. కాంగ్రేస్ పార్టీకి అధికారం కట్టబెడుతూ  64 స్థానాలతో  సంపూర్ణ మెజార్టి ఇచ్చారు. గతంలో కంటే కాంగ్రేస్ పార్టీకి  రెండంతలు ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ మాజిక్ ఫిగర్ వరకే పరిమితం చేశారు కాని  అఖండ విజయం చేకూర్చలేదు.ఈ ఎన్నిక్లో కాంగ్రేస్ విజయం కన్నా బిఆర్ఎస్ పార్టీపై విముఖత ప్రధానంగా చర్చకు వచ్చింది.  బిఆర్ఎస్ పార్టీపై అసంతృప్తికి వేరే గత్యంతరం లేక ప్రత్యామ్నాయం అంతకూ లేక కాంగ్రేస్ వైపు ప్రజలు మొగ్గు చూపక తప్పలేదు.  

ఈ నేపద్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టి ఏర్పాటు చేసే  ప్రభుత్వం ఎంత వరకు  సుస్థిరంగా  ఎంత కాలం పాటు నిలుస్తుందనేది చర్చనీయ మైంది. ఆరు గ్యారంటీలను ఎంత వరకు నెరవేరుస్తుంది  ప్రజల ఆకాంక్షలను  ఏ మేరకు తీరుస్తుంది అనేది ప్రశ్న. టిఆర్ఎస్ ను ఓ సారి ఓడిీంచి  వారికి బుద్ది చెప్పాలనేది ప్రజల ఉద్దేశమా ....  లేక నిజంగా కాంగ్రెస్ ను గెలిపించి తప్పిదం ఏమైనా చేశారా అనేది విశ్లేషించవలసిన అవసరం ఉంది.

కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు కావలసిన సీట్ల కన్నా బోటాబొటిగా  నాలుగు సీట్లు ఎక్కువ వచ్చాయి.   గతంలో ప్రతిపక్ష పార్టీల కన్నా అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చిన కర్ణాటకలో మధ్యప్రదేశ్లో ఏ విధంగా బిజెపి వారిని ఏమార్చి అధికారాన్ని గుంజుకుందో కాంగ్రెస్కు అనుభవం ఉంది. అలాంటి ఎత్తుగడలకు అవకాశం కల్పించే నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ నాయకులలో అంతర్గత ఘర్షణలు చాలా ఉన్నాయన్నది మనకు వారి ప్రచార సాధనాల్లో ఇద్దరు నాయకుల ఫోటోలు పెట్టడం ద్వారా సుస్పష్టమవుతుంది.

గెలిచిన తర్వాత 10 సీట్లపై కన్నా ఎక్కువ తమ జేబులో ఉన్నటువంటి నల్గొండ కోమటిరెడ్డి బ్రదర్స్ వారి గెలుపుకు సోనియాగాంధీని రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు గాని రేవంత్ రెడ్డి పేరు కూడా ఎత్తలేదు. అంటే ముసలకం అప్పుడే మొదలైంది అన్నమాట. 

ఈ మధ్య కులగణన పై దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైన చర్చ జరుగుతుంది. దానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. 

బిజెపి గెలిస్తే  బీసీ నాయకున్ని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించింది. బహుశా అదే కారణంగా కావచ్చు బిజెపి తన సీట్ల సంఖ్య అనూహ్యంగా పెంచుకుంది. ఇలాంటి బహుజనుల అధికారానికై కాంగ్రెస్ సానుకూలంగా ఉన్నది కాబట్టి ఈ రోజు బట్టి విక్రమార్క వెనుక ఈ బహుజన నాయకులు బహుజనులంతా నిలబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి యొక్క ఆకాంక్షలను తీర్చలేని పక్షంలో కాంగ్రెస్లో అంతర్గత ఘర్షణకు ఇంకొక కారణం కూడా ఉంటుంది. అంతేకాకుండా బీసీల నుండి కూడా ఈసారి అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలు గెలిచారు. 

అంతర్గత ఘర్షణల వల్ల కాంగ్రెస్ బలహీనపడి ఇతర పార్టీల రాజకీయ చదరంగా ఎత్తులకు బలి కాగల పరిస్థితిలు కొంతవరకు పైన మనకు కనబడుతున్నాయి. వీటిని సమర్థవంతంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఎదుర్కొన్న గలదా అనేది విస్మరించరాని   ప్రశ్న.

ఎలక్షన్ ఫలితాలు కాంగ్రెస్ కనుకూలంగా వస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి విజయోత్సవ ఊరేగింపులో పచ్చ జెండాలు కనబడ్డాయి. అంటే తెలుగుదేశం వాసనలు ఇంకా పోలేదని అర్థం. షర్మిల పోటీల్లో పాల్గొనక పోవడం వల్ల ఓట్లు చీలకపోవడం వల్ల కూడా కాంగ్రెస్కు లాభమైందనేది కొందరు అభిప్రాయం. హైదరాబాదులో కమ్మ మరియు ఇతర వర్గానికి చెందిన  చెందిన ఆంధ్ర నాయకులు బిఆర్ఎస్ తరఫున గెలిచారు. కెసిఆర్ చేయబట్టే కొంత తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు  జగన్ జంకాడు  అని ఇప్పుడు ఆ అవకాశం వదులుకోడని తెలంగాణ నుండి కూడా ఇప్పటికీ మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటేనే బాగుండుననే భావనలు కొందరు వ్యక్తం చేస్తున్నారన్న విషయాలు అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితులలో తమ పార్టీ బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈ ఆంధ్ర నాయకులతోని చేతులు కలిపితే అప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ కు ఊతం వచ్చి కేసీఆర్ రంగంలోకి దిగి ఇంత కష్టపడి తెచ్చుకున్నటువంటి అధికారాన్ని ఊడగొట్టే  అవకాశాలుంటాయి. కాబట్టి తాను ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఈ అస్థిరతకు పాల్పడే శక్తుల యొక్క సామర్ధ్యాలు ఎత్తుగడలకు దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది.

 ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండవ రాష్ట్రం అయ్యింది. ఉత్తర భారత దేశంలో రాజస్థాన్ది మధ్యప్రదేశ్ చత్తీస్గడ్ లో విజయ ఢంకా మోగించిన బిజెపి సహించదు.  దీన్ని ఎట్లాగైనా పడగొట్టేందుకు అన్ని రకాల అస్త్ర శాస్త్రాలు వాడుతుంది. అందులో బిఆర్ఎస్ చేయూత ఉంటుందని ఎలాంటి సందేహాలు అవసరం లేదు. 

ఇప్పుడున్న సీట్ల ప్రకారము కాంగ్రెస్ను పడగొట్టేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వీటి గురించి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది.

ఉదాహరణకి నల్గొండ రెడ్డి బ్రదర్స్, చేతిలో ఉన్న పదిమంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి పదవి కోసం బి ఆర్ స్ లో చేరే అవకాశాలున్నాయి. 

కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేందుకు అన్ని విధాల అనుకూలంగా ఉందని చెప్పలేం. దీనికి కాంగ్రెస్ నాయకత్వం ఎంతో చతురతతో పనిచేయవలసి ఉంటుంది. సుస్థిర ప్రభుత్వం కావడం మూలంగానే టిఆర్ఎస్ చాలా అభివృద్ధి సాధించగలిగింది తద్వారా రెండవసారి కూడా అలవోకగా అధికారంలోకి వచ్చింది అనే విషయాన్ని మర్చిపోకూడదు. 

రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారిన కూడా ప్రజలకు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందించడంలో అందరు రాజకీయ నాయకులు కర్ణాటకలో మధ్యప్రదేశ్ లో గోవాలో జరిగిన విధంగా అధికార ప్రలోభాలను కొంత పక్కన పెట్టి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిద్దాం


డాక్టర్ ఎంహెచ్ ప్రసాదరావు

9963013078

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు