స్వతంత్ర అభ్యర్థిగా న్యాయవాది సత్యప్రకాష్ మూడోసారి బరిలో

 


ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు అరుదుగా రాజకీయాల వైపు వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. ధనవ్యయంతో కూడుకున్న ఎన్నికలు మాకెందుకులే అని విద్యాధికులు భావించి కేవలం ఓటర్లుగా మాత్రమే మిగిలి పోతుండడంతో రాజకీయాలను గూండాలు, రౌడీలు, కబ్జాదారులు అక్రమించారు. అయినా సరే పౌరసమాజాన్ని జాగృతం చేసేందుకు నేను కాకుంటే ఇంకెవరంటూ విధ్యాధికుడు అయిన సత్యప్రకాష్ ఎన్నికల్లో పోటీకి తలపడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గం ( హన్మకొండ) నగరానికి చెందిన ప్రకాష్ ప్రజాస్వామ్యంలో సత్యాన్వేషణ లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 

 చట్టసభలకు ప్రాతినిద్యం వహించి ఆదర్శనీయంగా ప్రజా సేవ చేయాలనే లక్ష్యం సత్యప్రకాష్ ది. జాతీయ, అంజర్జాతీయ అంశాలపై మంచి అవగాహన కలిగి వృత్తి రీత్యా న్యాయ వాదిగా కొనసాగుతున్న ప్రకాష్ తన ప్రయత్నాలలోపట్టు విడవకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 2009 ఎన్నికల నుండి శాసన సభ ఎన్నికలలో వరుసగా పోటీలో నిలుస్తూ వస్తున్నారు. 


ఆయన వెంట మంది మార్బలం మైకులూ వాహనాల కాన్వాయ్ వంటి ఆర్బాటాలు లేకుండా  హన్మకొండ నియోజకవర్గం అభివృద్ది విషయంలో ప్రజా ప్రతినిధుల వైఫల్యాలపై ముద్రించిన కరత్రాలు పంచుతూ తనకే ఎందుకు ఓటేయాలో ఓటర్లను కల్సి వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

సత్యప్రకాష్ ఈ ఎన్నికల్లో పలక గుర్తు పై పోటీ చేస్తున్నారు.


 పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ది వేగంగా జరుగుతుందని సత్యప్రకాష్ అభిప్రాయం. స్వతంత్ర అభ్యర్థులు చాలా బలమైన వ్యక్తులుగా స్వతంత్రంగా ప్రజల ఆశయాలు నెర వేర్చేందుకు ప్రజాభిప్రాయం మేరకు పనిచేస్తారని ప్రజలే వారికి హై కామాండ్ గా ఉంటారని సత్యప్రకాష్ అంటున్నారు.


చారిత్రక ప్రాధాన్యత కలిగిన హన్మకొండలో జరగాల్సిన అభివృద్ది జరగలేదన్నారు. విద్యాసంస్థలు ఉన్నా చదువులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు లేవన్నారు. ఒక్క పరిశ్రమ కూడ లేక పోవడం వల్ల అభివృద్దిలో వెనుకపడి పోయిందన్నారు. వేయి స్థంభాల ఆలయం వంటి కట్టడాలకు సరైన ఆదరణ లేదన్నారు.


నగరం వేగంగా విస్తరిస్తున్నా మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. నల్లాపైపులు లీకేజి అయి రోడ్లపై వరదై పారుతుంటే కూడ ఎవరూ పట్టించు కోవడం లేదన్నారు.

ప్రజలు ఎదుర్కుంటున్న నిత్య సమస్యలను ఎవరూ పట్టించు కోవడం లేదన్నారు. నల్లా పన్నులతో పాటు చెత్త పన్ను ఇంచి పన్నులు విపరీతంగా పెంచారని కరెంట్ బిల్లులు తడిసి మోపెడయ్యాయని అన్నారు. నిత్యావసర సర్కులు ధరలు విపరితంగా పెరిగాయని రాజకీయ పార్టీల  ఉచితాలు పెన్షన్లు ధరలపెరుగుదల ముందు దిగదుడుపేనన్నారు.

ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై తనకు అపార గౌరవ మర్యాదలు ఉన్నాయని తన అభ్యర్థనను అర్దం చేసుకుంటారన్న నమ్మకం ఉందని  అన్నారు.

సమస్యలు చిన్నవి పెద్దవి అనేవి కాకుండా ప్రజల సమస్యలన్ని తన స్వంత సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని సత్యప్రకాష్ పేర్కొ న్నారు. ఓటర్లు మార్పు కోసం  ఆలోచించి విజ్ఞతగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. పలక గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని సత్యప్రకాష్ కోరారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు