గుడ్ న్యూస్ ఇక హెచ్ 1 బి వీసాల రెన్యువల్ అక్కడే

 అమెరికాలో ఉన్న హెచ్ వన్ బి వీసా దారులకు ఎంతో ఊరట కలిగించే వార్త. 

ఇక నుండి హెచ్ వన్ బివీసాల రెన్యువల్ కోసం ఇండియాకు రానవసరం లేకుండా

అక్కడే రెన్యువల్ చేసుకునే సౌలభ్యం మరి కొద్ది రోజుల్లో అమల్లోకి రానుంది. 

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోది జూన్ లో అమెరికా సందర్శన సందర్భంగా జో బైడెన్ తో జరిపిన చర్చల్లో వీసాల రెన్యువల్ అంశం చర్చకు వచ్చింది. 

జో బైడెన్ సానూకూల నిర్ణయం ఈ మేరకు కొన్ని కేటగిరీల హెచ్ వన్ బీ వీసాలను ఇండియాకు రానవసరం లేకుండా

అమెరికాలోనే ఉండి పోయి రెన్యువల్ చేసుకునేలా ఓ పైలట్  ప్రా జెక్టు చేపట్టాలని

 అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. 


జోబైడెన్ ప్రభుత్వం తీసుకోబోయే ఈనిర్ణయం వల్ల ఎక్కువ శాతం భారతీయులకు ఊరట లభించనుంది. 


అమెరికాలో భారత ఐటీ నిపుణులకు ఈ నిర్ణయం ఎక్కువ లబ్ది చేకూరుస్తుందని భావిస్తున్నారు.

ఈ నిర్ణయానికి సంభందించి వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ మాట్లాడుతూ.. " భారత్లో యూఎస్ వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని  అమెరికా వీసా కావాలంటే సుమారు ఆరు నెలలు అంతకంటే ఎక్కువగా కొన్ని సందర్భాలలో  ఏడాదికి పైగా  ఎదురు చూడాల్సి వస్తున్నదని  ఇకపై అలా ఎదురు చూసే అవసరం ఉండదని అన్నారు.


అమెరికాలో ఉంటూ యూఎస్ వీసా రెన్యూవల్ కోసం ఎదురు చూస్తున్న  వారి కోసం ప్రత్యేకంగా డొమెస్టిక్ వీసా రెన్యూవల్ ప్రోగ్రామ్ ను త్వరలో ప్రారంభించనున్నామని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ తెలిపారు.  డిసెంబర్లో ప్రారంభించబోయే వీసా రెన్యూవల్ పైలెట్ ప్రోగ్రామ్లో సుమారు 20వేల వీసాల్ని రెన్యూవల్ చేసే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్లో అమెరికాలో నివసిస్తున్న ఎక్కువ మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుందని  దశల వారీగా వీసా రెన్యూవల్ సంఖ్యను క్రమంగా  పెంచుతామని ఆమె అన్నారు.


అమెరికాలో నివసిస్తున్న ఐటి నిపుణుల్లో భారతీయులే ఎక్కువ. ఐటి నిపుణులకు స్థానిక కంపెనీలు హెచ్-బీ వీసాను అందిస్తుంటాయి. రెన్యూవల్ సైతం అక్కడే ఉండి చేసుకోవచ్చు. ఈ వీసా రెన్యూవల్ ప్రాసెస్ 2004 వరకు ఉండేది. కాల క్రమేనా వీసా నిబంధనల్లో మార్పులు తెచ్చారు. అలా అమెరికాలో ఉంటున్న భారతీయులు వీసా రెన్యూవల్ కోసం భారత్ వచ్చి వీసా రెన్యూవల్ చేయించుకుని తిరిగి వెళ్లే వారు. 

గత ఏడాది లక్షా నలభై వేల మంది భారతీయులకు అమెరికా వీసాలు జారి చేసింది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు