మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించుకున్న గులాబీల జెండలే పాట

 ఎన్నికల నగారాలో గులాబీల జెండలే పాట వైరల్ గా  బాగా వైరల్ గా మారింది
ఓ పల్లెటూరి మహిళ కొమ్ము లక్ష్మమ్మ ఈ పాట పాడి ఫేమస్ అయింది

యూట్యూబ ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించుకుంది

సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలపై లక్ష్మక్క పాడిన పాట లేకుండా బిఆర్ ఎస్ పార్టి ఎన్నికల సభలు జరగడం లేదు
గులాబీల జెండలే పాట తో అందరూ గంతులు వేస్తూ ఎగురుతుంటే లక్ష్మక్క మురిసి పోతోంది
సిఎం కెసిఆర్ తో పాటు కెటిఆర్ హరీశ్ రావు సహా అనేక మంది లక్ష్మక్క బృందాన్ని ప్రశంసించారు


తెలంగాణ లో ఓ పాట ఇప్పుడు జనాలను ఉర్రూతలూగిస్తోంది

మారుమూల పల్లె నుండి ఓ మహిళ నోట ఆసువుగా పుట్టికొచ్చిన పాట ప్రాణం పోసుకుని పల్లెల నుండి పట్టణాల వరకు అందరిని స్టె్పు లేయిస్తోంది

నాగర్‌ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గం, తాండ్ర గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మమ్మ పాట కథ ఇది

ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టి మీటింగ్ కోసం లక్ష్మక్క పాడిన రామక్క పాట ఇంతగా వైరల్ అవుతుందని ఆమె కూడ అనుకోలేదు

యక్షగానం చేసే కుటుంబం నుండి వచ్చిన లక్ష్మమ్మ గ్రామంలో ఒకప్పుడు  కూలి పనులతో బతికేది.

భర్తను కోల్పోయిన లక్ష్మమ్మ తన ఇద్దరు కొడకులను చదివిస్తూ గ్రామపంచాయితీలో వర్కర్ గా పనిచేస్తోంది.

 శ్రామిక మహిళలతో కల్సి పంటపొలాల్లో తాను గొంతెత్తేది

పాట తనకు కుటుంబ వారసత్వంగా వచ్చిందని లక్ష్మమ్మ చెబుతుంటారు

గ్రామంలో జరిగే సభలుసమావేశాలు ఆమె పాటలేకుండా జరగవు

ఈ క్రమంలోనే సర్పంచ్ ప్రోత్సాహంతో లక్ష్మమ్మ కెసిఆర్ మీటింగ్ కు వెళ్లి రామక్క పాట పాడింది

బిఆర్ఎస్ పార్టీ కోసం కెసిఆర్ సంక్షేమంపై  స్వయంగా తానే పదాలు కూర్చి పాడిన పాట

సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో

 సిఎం కెసిఆర్ లక్ష్మమ్మ పాట విని ఆమెను ఆమె బృందాన్ని  ప్రగతి భవన్ కు పిలిపించి ప్రశంసలు కురిపించారు

పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మంత్రి హరీశ్ రావు వారిని అభినంది

లక్ష్మక్క పాటను స్టూడియోలో కంపోజ్ చేసి విడుదల చేసారు

లక్ష్మక్క పాట ఇప్పుడు బిఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభల్లో ఉర్రూతలూగిస్తోంది

ఆ పాటకు జనం లేచి స్టెప్పులేస్తున్నారు

కొన్ని సభల్లో స్వయంగా లక్ష్మక్క బృందం ఈ పాటను స్వయంగా పాడుతోంది

తనకు లభిస్తున్న ఆదరణకు లక్ష్మక్క తో పాటు ఆమె బృందం సబ్యులు బొల్లె సుశీల, శాంతమ్మ, కమలమ్మ, అనసూయ ఆనందానికి అవధులు లేవు

నిరుపేదరాలైన లక్ష్మక్కకు ఈ పాట ద్వారా ఆర్థిక కష్టాలు ఎంత వరకు తీరనున్నాయో సిఎం కెసిఆర్ ఏ మేరకు హామీలు  ఇచ్చారో కాని

లక్ష్మక్క సెలబ్రేటి అయింది

తాను డబ్బులు ఆశించి పాట పాడలేదని డబ్బుకన్నా తన పాటకు ఆదరణ, గౌరవం గుర్తింపు చాలని అవన్ని తనకు తమ పాటతో లభించాయని  లక్ష్మక్క మీడియా వారితో మాట్లాడుతూ సంతృప్తి వ్యక్తం చేశారు.


వీడియో కోసం క్లిక్ చేయండి 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు