*_ఒక్క మోడీలో ఎన్ని రూపాలో..!_*
*ఆయన దేశానికి ప్రధాని..*
అంతేనా..
రోజుకు మూడు డ్రస్సులు మార్చే *సోగ్గాడు..*
అక్కడితో అయిపోలేదు..
తాను సాధించింది
గొప్పగా చాటుకునే
*ప్రచారవేత్త..!*
ఇంకా అవ్వలేదు..
చెయ్యనిది కూడా చేసినట్టు
చూపించగలిగే *అబ్రకదబ్ర..!*
*అబ్బో ఇంకా చాలా ఉంది..*
తన వైఫల్యాలను
అద్దంలో..
ఎదుటివారి బలహీనతలను
బూతద్దంలో
చూపెట్టగలిగే *నేర్పరి..*
*తను చెబితే మన్ కి బాత్*
ఎదటోడైతే *మన్ కి భూత్..*
అభివృద్ధిని అందంగా..
వెనకబాటును కల్పనగా
చిత్రించగలిగే *కూర్పరి..!*
*ఇంకా చాలా ఉంది..*
ముందు ఆయనెవరో చెప్పాలిగా..
తెలిసే ఉంటుంది..
*ఆధనిక భారత నిర్మాత..*
భారత ప్రధానుల్లో
ఇందిరమ్మ తర్వాత
*most talked*
*About prime minister..*
*_నరేంద్ర దామోదర్ దాస్ మోడీ..!_*
*నిజమే..*
గత ఒకటిన్నర దశాబ్ద కాలంగా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా
*మారు మ్రోగిపోతున్న పేరు..*
దేశానికి ప్రధాని కావడానికి
ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు ఎన్నికై
ఆటు దేశంలో పరిస్థితులు..
ఇటు భారతీయ జనతా పార్టీలో కొన్ని అంశాలు కలిసి వచ్చి..2014 ఎన్నికల్లో ఆయన బొమ్మే ప్రధాన ఆకర్షణగా బిజెపిని అధికారంలోకి తెచ్చిన *ఘనాపాటి..*
ఇదంతా జరగడానికి
తెర వెనుక చాలా
కధ నడిచింది..
నువ్వు వెలుగులోకి రావాలంటే చాలా మందిని చీకట్లోకి నెట్టాలన్న
ప్రాథమిక సూత్రం ఆధారంగా
నడిచిన *లంబీ క'హాని'..*
రాజకీయాల్లో ఇవన్నీ తప్పేవేమో కదా...
ఇవే మోడీ ప్రధాని కావడానికి..ఇప్పుడు
పార్టీలో ఆయనకు
ఎదురే లేకుండా..
తన పదవికి మరొకరు పోటీకి రాకుండా చేసేందుకు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్న వ్యూహాలు..
అంతర్గత కలహాలు..!
ఇవన్నీ ఏ పార్టీలోనైనా..
ఎలాంటి అధినాయకుడైనా
గాని అమలు చేసే వ్యూహాలే..అయితే ఇప్పుడు గనక..ప్రచార సాధనాలు విస్తృతంగా ఉన్న రోజులు కాబట్టి ఎక్కడ జరిగే
ఏ విషయమైనా.. అంతర్గతమే
కాని..బహిరంగంగా అవనీ గబగబా కొన్ని సందర్భాల్లో ఎక్కువగా..ఇంకొన్ని సార్లు
అటూ ఇటుగా మొత్తం మీద వేగంగా.. విస్తృతంగా వెళ్లిపోతున్నాయి జనాల్లోకి..
అలా మోడీజీ పేరు మంచిగా..చెడుగా కూడా జనంలోకి విపరీతంగా చొచ్చుకుపోయి ఆయన జాతీయంగా..
అంతర్జాతీయంగా
కూడా ప్రముఖుడిగా ఎదిగారు..అదెంతలా అంటే
కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీగా పేరెన్నిక గన్న బిజెపిలో ఇప్పుడు ప్రధాని అభ్యర్థిగా మోడీ తప్పించి ఎవరూ లేరనే స్థాయిలో..!
అయితే ఎంతగా
ఎవరు ఎన్ని
విమర్శలు చేసినా
ఆ మనిషిలో *ఏదో మ్యాజిక్* లేకపోతే ఇదంతా జరగదు కదా..మోడీ తన కుటుంబాన్ని రాజకీయాల జోలికి గాని..తన అధికార పరిధిలోకి గాని తీసుకురాలేదు...
ఆయన పెళ్లి అయి..
భార్య కూడా ఉన్న *బ్రహ్మచారి..*
అన్నదమ్ములు ఇతర కుటుంబసభ్యులు చాలా మంది ఉన్నా గాని *ఏకాకి..*
అత్యంత ఖరీదైన బట్టలు
ధరిస్తూ విలాసవంతమైన కార్లలో..విమానాల్లో ఖుషీగా తిరిగే *రుషి..*
తాను అవినీతికి పాల్పడకపోయినా
అక్రమ మార్గాల్లో కోట్లు సంపాదిస్తూ
ప్రపంచ కుబేరులుగా
ఖ్యాతి గాంచిన మాయావులతో నిత్యం సంచరించే *స్నేహజీవి..*
తన స్వరాష్ట్రానికి..
సొంత వర్గానికి చెందిన వ్యక్తులకు అతున్నత పదవులు కట్టబెట్టినా కూడా ఆశ్రితపక్షపాతి అనే మచ్చ అంటకుండా మేనేజ్ చేస్తున్న *గడసరి..* ప్రభుత్వంలో.. పార్టీలో తాను తప్పించి మరో దిక్కు లేదన్న స్థితికి పరిస్థితులను నడిపించిన *దిట్ట..* 2014 ఎన్నికల్లో కొన్ని కీలకమైన
వాగ్దానాలు చేసి అవి నెరవేర్చలేకపోయినా
2019 ఎన్నికల్లో అవే వాగ్దానాలను మళ్లీ చేసి మరోసారి గెలిచి ఇప్పటికీ వాటిని నెరవేర్చకపోయినా
విజయవంతమైన
ప్రధానిగా పేరు గాంచిన *గజకర్ణ..*
ఇలాంటి వైఫల్యాల
నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి
కాశ్మీర్ విషయంలో కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుని భేష్ అనిపించుకున్న *గోకర్ణ..*
కొన్ని వర్గాల ప్రజలకు ఏది నచ్చుతుందో గుర్తెరిగి
తదనుగుణంగా భారీ విగ్రహాలు..ఆలయాలు..
మందిరాలు నిర్మించి అదంతా అద్భుతమైన అభివృద్ధిగా
సినిమా చూపించగల *దర్శకుడు...* ఏం చేస్తే ప్రజలు ఇట్టే పడిపోయి 2024 లో కూడా తమ పార్టీకే..అది కూడా తన బొమ్మతోనే అధికారం కట్టబెడతారో బాగా తెలిసిన *దార్శనికుడు..!*
_మొత్తానికి దేశ రాజకీయాల్లో_
_వర్తమాన పరిస్థితుల్లో_ _బహుముఖ ప్రజ్ఞతో.._
_అసమాన ప్రతిభతో_
*ఒకే ఒక్కడు* _గా_
_విరాజిల్లుతున్న_ _ప్రధానమంత్రి_
_నరేంద్ర మోడీకి_
*జన్మదిన శుభాకాంక్షలు!*
💐💐💐💐💐💐💐
_*ఎలిశెట్టి సురేష్ కుమార్*_
జర్నలిస్ట్
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box