సినీ పరిశ్రమకు చిరునామా అక్కినేని

 


*_పాత్రకు ప్రాణం పోస్తే_*

*_అది అక్కినేని..!_*

+++++++++++++++++


*_ఎప్పటి సీతారామజననం_*

*_ఎక్కడ మనం.._*

ఈ రెంటి మధ్యనే 

*తెలుగు సినిమా గమనం..*

మూకీలు ముగిసి టాకీలు మొదలైన టాలీవుడ్ లో

*అక్కినేని ప్రవేశం*

*ఓ చారిత్రక సన్నివేశం..!*


తొలినాళ్ళలో ఆయనకు పరిశ్రమ చిరునామా

తర్వాత ఆయనే అయ్యారు

*పరి"శ్రమ"కు చిరునామా..*

కళాఖండాలకు వీలునామా..!

ఆరడుగుల ఎన్టీఆర్ కు 

పోటీ అయ్యాడు 

ఈ నటనలో మేటి

ఇద్దరూ ఎవరికి వారే సాటి..

నందమూరి పౌరాణికుడైతే

అక్కినేని నటనకు

*_ప్రామాణికుడయ్యాడు.._*

ఆయన రాముని మించిన 

రాముడనిపించుకుంటే

ఈయన రాముడు 

కాదు కృష్ణుడు..

తాండవకృష్ణుడు..!


రెండు సినిమాల్లో 

రామారావు కృష్ణుడై 

ఒకేలాంటి నటనను ప్రదర్శిస్తే

*మాయాబజార్లో* అభిమన్యుడిగా

*కృష్ణార్జునయుద్ధం* లో కిరీటిగా

విభిన్న ప్రదర్శన అక్కినేనిది..

పాత్ర ఏదైనా ఆయన

*_అభినయం తిరుగులేనిది!_*


తొలితరం *రొమాంటిక్ హీరో*

*నవలానాయకుడు..*

*_భగ్నప్రేమికుడు.._*

భక్తి లేకపోయినా 

తెరపై మహాభక్తుడు..

మందుకొట్టని 

తాగుబోతు నటుడు..

*ఆ లోతు కళ్ళు*

*వేయి భావాల ఆనవాళ్లు*

నిషాకు నకళ్లు

భక్తి వాకిళ్ళు

రోషం ప్రదర్శిస్తే నిప్పురాళ్లు..

కోపం వర్షించే 

తుపాకీ గుళ్ళు..

భాగ్యనగరిలో తెలుగు సినిమాకి పునాదిరాళ్ళు..!


పారూ..నాతో రాత్రికి రాత్రే

లేచి వచ్చేస్తావా

అన్న *_దేవదాసు.._* 

నాగేశ్వర రావు

నటవిశ్వరూపానికి

పూర్తి డోసు..

*లతా ఎందుకు చేసావీ పని..*

అన్న ఒక్క డైలాగ్ 

సురేష్ ప్రొడక్షన్స్ కు 

కలెక్షన్ల గని..

బెంగాలీ *దేవదాసు*

మొఘలాయి *సలీం*

గ్లాసు పడితే దేవదాసు

కలం పట్టితే *కాళిదాసు*

లేని మైకం నటిస్తూ

శ్రీదేవికి,జయసుధకు కలిపి చేశాడు *_ప్రేమాభిషేకం.._*

సావిత్రితో నాగ్గాడు జతకడితే

నిర్మాతలకు కనకాభిషేకం..


*జగపతి* సంస్థకు 

జేబు నిండుగా

*సురేష్ ప్రొడక్షన్స్* 

తన జేబు సంస్థగా

*ఇల్లాలు* అన్నపూర్ణ కి

ఆమె పేరిట పెట్టిన *అన్నపూర్ణా* సంస్థకు _*వెలుగునీడ*_ గా..

విరాజిల్లిన *_చక్రధారి.._*

ఎన్నో సంచలన 

విజయాల సూత్రధారి..!

ఆయన నటించిన 

ప్రతి శోక సన్నివేశం

మన కళ్లు వర్షించి

ఇచ్చే *_మేఘసందేశం.._*

స్టెప్పైనా..సిప్పైనా..

క్లోజప్పైనా..ఏ గెటప్పైనా..

అక్కినేని ఒక్కడికే నప్పేనా..

దిలీప్ కుమార్ అంతటివాడైనా

తన కంటే ఏయెన్నారే 

గొప్పని ఒప్పుకోక తప్పేనా..

ఆయన మహానటుడని

జగమంతా పలికే..

అందుకే ఆయనయ్యాడు

*దాదా సాహెబ్ ఫాల్కే..!*


🌸🌸🌸🌸🌸🌸🌸అక్కినేని నాగేశ్వరరావు 

శతజయంతి(20.09.1923) 

సందర్భంగా ప్రణామాలు 

*********************     

*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*

      *విజయనగరం*

        9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు