కృష్ణ సమర్పించు.. ఓ సంచలనం..!

 



పండంటికాపురానికి
యాభైరెండేళ్లు ఏళ్లు..!

బాబూ వినరా 

అన్నాదమ్ములా కథ ఒకటి..

ఆ ఒక్క ముక్కే

పండంటికాపురం 

సినిమా కమామిషు..!


నలుగురు అన్నదమ్ములు..

వారి ఐకమత్యం..

కలతలు లేని కుటుంబం..

మీ ఇంట్లో..మా ఇంట్లో..

అన్ని ఇళ్లలో కనిపించే 

సన్నివేశాలు..!


ఇంతలో రానే వస్తుంది

రాణి మాలినీదేవి..

ఒకనాటి ప్రేమ..

మర్నాటి పగ..

పచ్చని కాపురంలో సెగ..

బాబూ వినరా పాట 

వరస మారి..

కన్న కలలు అన్ని కూడ

కల్లలాయెరా..

అన్నదమ్ములొకటనుట 

అడియాశే ఆయెరా..

గూటిలోని ఆ గువ్వలు

చెదిరిపోయెరా..

స్వర్గమంటి ఇల్లంతా

నరకంగా మారెరా..!


బరువైన సీన్లు..

బిడ్డ మరణం..

ఇంటి పెద్ద ఆక్రోశం..

చల్లని తల్లి ఆ ఇల్లాలు..

కుమిలి కుమిలి..

గుండె పగిలి..

ఆ ఇంటి గారాల పట్టి

తన కడుపున పుట్టి

అక్కడ పెరుగుతుందని తెలిసిన మాలిని మారింది..

శుభం కార్డు పడింది..!


ఇంటి పెద్దగా ఎస్వీఆర్ 

శిఖరాగ్ర నటన..

గుమ్మడికి కొట్టిన పిండి పాత్ర

మధ్యలో అలవాటు లేని

ప్రేమయాత్ర..

దేవిక సహజత్వానికి ప్రతీక..

ప్రభాకరరెడ్డి..సరోజాదేవి..

అల్లు..రాథాకుమారి..

రాజబాబు..రమాప్రభ..

రామ్మోహన్..మిక్కిలినేని..

కన్నుల నిండుగా

భారీ తారాగణం..

హిట్ జంట..

కృష్ణ..విజయనిర్మల..

జయసుధ,నరేష్ 

తొలిమెరుపు..

ఆడపిల్ల సులక్షణ

బాబుగా మారి..

బాబూ వినరా..

విషాదం కనరా...!


ఇక సినిమాకే సొగసు

జమున పొగరు...

రాణి మాలినీదేవి..

ఆ చీరకట్టు..చేతికి గ్లవ్స్..

చలువ కళ్లద్దాలు..

పడవ కారు..

అహంకారం నిండిన స్వరం..

బిలియర్డ్స్ ఆట..

గొడ్రాలు అన్నందుకు

మనసా కవ్వించకే నన్నిలా

అంటూ ఆవేదన..

అంతా అద్భుతం..

రాణి మాలినీ

హిందీలో హేమమాలిని

వేసినా దిగదుడుపే..

ఇప్పటికీ కొంచెం స్టిల్లు కొట్టే

ఆడాళ్ళకు ఆ పిలుపే..

నిజంగా జమున 

ఇప్పటి భాషలో తోపే..!


కోదండపాణి సంగీతం..

స్వామి కెమెరా పనితనం..

లక్ష్మీదీపక్ దర్శకత్వం..

అన్నీ అదిరి..

పండంటికాపురం

రజతోత్సవ సంబరం..!


********

ఎలిశెట్టి సురేష్ కుమార్

      9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు