దుఖ్ఖంలో ఉన్న ఎన్ఆర్ఐ కుటుంబానికి అండగా నిలిచిన వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ యుకె టీం


జీవనోపాధి కోసం లండన్ వెళ్లి ఆరోగ్యం సహకరించక కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన ఎన్ఆర్ఐ కుటుంబానికి వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ యుకె బృందం అండగా నిలిచింది. హైదరాబాద్ కు చెందిన ప్రకాష్ ఈగ తన భార్య మేరి కుమారుడు సన్నీతో కల్సి లండన్ లో అక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు.  అయితే ఇటీవల ఆరోగ్యం సహకరించక పోవడంతో  అనారోగ్యంతో జీవితం చాలించాడు. దాంతో ఆకుటుంబాన్ని ఆదుకునేందుకు వరంగల్ ఎన్ఆర్ ఐ ఫోరం సబ్యులు బాసటగా నిలిచి ఆదుకున్నారు. వరంగల్ ఎన్ఆర్ ఐ ఫోరం లండన్ యుకె అధ్యక్షలు శ్రీధర్ నీల ప్రత్యేక చొరవ చూపి కుటుంబానికి ఎన్ఆర్ ఐల సహకారం అందేలా తోడ్పాటు అందించారు.  వ్యక్తిగతంగా ఎవరికి వారు తోచిన విదంగా విరాళాలు అంద చేసి   గో ఫండ్ ద్వారా  కూడ విరాళాల కోసం అప్పీల్ చేశారు.

భారత సంతతికి చెందిన వారు ప్రధానంగా తెలంగాణా ఎన్ఆర్ ఐలు మేరి కుటుంబానికి చేదోడుగా నిలిచారు. ప్రకాష్ పార్దీవ దేహాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు సహాయపడ్డారు. ఖర్మకాండలు పూర్తి చేసి  తిరిగి లండన్ తిరిగి వచ్చిన మేరి కుటుంబానికి వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం బృందం సబ్యులు విరాళాలు అంద చేసారు. పోగైన విరాళాన్ని బ్యాంకులో ఫిక్సుడ్ డిపాజిట్ చేసినట్లు శ్రీధర్ నీల తెలిపారు.

మేరీకి ఏ సహాయం అవసరం అయినా పూర్తిగా సహకరిస్తామన్నారు. ఆమెకు ఉపాధి అవకాశాల కోసం కూడ తోడ్పడతామని హామి ఇచ్చారు.హైదరాబాద్ బవార్చి హోటెల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మేరి కుటుంబానికి బాండు అంద చేసారు.

వరంగల్ ఎన్ఆర్ ఐ ల సహాయానికి వారు చూపిన మానవతకు మేరి ఆమె కుమారుడు సన్నీ  కృజ్ఞతలు తెలియ చేశారు.

ఈ కార్యక్రమంలో 

స్రీధర్ నీల, పౌండర్ మెంబర్ పసునూరి కిరణ్, సొలిసిటర్ ఫ్రాన్సిస్, గంప వేణుగోపాల్ జెటి యుకె నర్సిన్న, భాస్కర్ పిట్టల, ప్రవీణ్ పిట్టల, మధు వంగర, రజిత, లక్ష్మి, మంజుల, పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు