కెసిఆర్ కుటుంబ పాలనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోది విమర్శలు

 హైదరాబాద్ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది కెసిఆర్ కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. కుటుంబ పాలన అవినీతి వేరు వేరు కాదని తండ్రి , కొడుకు ,కుమార్తే అందరూ కల్సి అధికారంలో ఉన్నారన్నారు.

సికింద్రాబాద్ నుండి తిరుపతికి వారంలో ఆరురోజుల పాటు నడిచే వందేభారత్ ట్రైన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ట్రైన్ లో విద్యార్థులతో కొద్ది సేపు మాట్లాడారు.  

సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ అభివృద్ది పనులకు అట్లాగే 13 ఎంఎంటీఎస్ రైళ్లను వర్చువల్ పద్ధతిలో జెండా ఊపి ప్రారంభించారు. ఏదు జాతీయ రహదారుల నిర్మాణ పనులకు బీబీ నగర్ ఎయిమ్స్ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.


బేగంపేట పరేడ్ గ్రౌండ్ లో  జరిగిన బహిరంగ సభలో  ప్రసంగించిన ప్రధాన మంత్రి సోదర సోదరీ మనులారా అంటూ తెలుగులో తన ప్రసంగం మొదలు పెట్టారు. సిఎం కెసిఆర్ కుటుంబ పాలనను ఎత్తి చూపుతూ  కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోందని నిజాయితీగా పనిచేసే వారంటే గిట్టడం లేదని  తమ అధికారం కోసం వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని వాటిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు చేశారు. కుటుంబ పాలన నుండి విముక్తి జరగాలని అన్నారు. 


అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలా వద్దా అంటూ సభలో ప్రధాన మంత్రి ప్రశ్నించారు. అవినీతిపరులపై చర్యలు తీసుకునేందుకు చట్టం తన పని చేసుకోవాలా వద్దా అంటూ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర అనేక పనులు చేపట్టిందని దేశాభివృద్దిలో తలంగాణ రాష్ర్టం భాగమయ్యేలా చేశామని అయితే అభివృద్ది పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రంతో కల్సి రావడం లేదన్నారు. కేంద్రం చేసే అభివృద్ది పనులు చూసి రాష్ట్ర ప్రభుత్వానికి భాద కలుగుతోందన్నారు.

రైతులకు కార్మికులకు ప్రయేజనం కలిగేలా తెలంగాణ రాష్ట్రంలో టెక్స్ టైల్ పార్కు మంజూరు చేశామని తెలిపారు. రాష్ర్టంలో 35 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ది జరుగుతోందన్నారు.

బండికి ప్రత్యేక పలకరింపు

ఒక్క రోజు పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన  ప్రధాన మంత్రికి బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎంపి డాక్టర్ కె లక్షన్ పార్టి నేతలు స్వాగతం పలికారు. ప్రధాన మంత్రికి అభివాదం చేసిన బండి సంజయ్ చేతులు పట్టుకుని ప్రత్యేకంగా పలకరించి అభినందించారు.



పదో తరగతి పరీక్ష పత్రం నేరారోపణ పై బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో  ఒక్కరోజు ముందుగా బండి సంజయ్ జైలు నుండి బయటకు వచ్చారు.

రాష్ట్రం లో జరిగిన పరిణామాలపై నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలు సీరియస్ గా ఉన్నారు. బండి సంజయ్ పై అక్రమంగా త్పపుడు కేసు పెట్టారని పార్టి నేతలు అగ్రహంతో ఉన్నారు.

సిఎం కెసిఆర్ గైర్హాజర్

ప్రధానమంత్రి నరేంద్ర మోది పర్యటనలో సిఎంకెసిఆర్ ఎప్పటి లాగే గైర్హాజర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు