ఆ బాపతు ఎమ్మెల్యేలకు కెసిఆర్ ఫైనల్ వార్నింగ్

 


తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన భారత్ రాష్ట్ర సమితి జనరల్ బాడి సమావేశంలో సిఎం కెసిఆర్ కొందరు ఎమ్మెల్యేలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. దళిత భందు పథకంలో డబ్బులు దడుకున్న భాపతు ఎమ్మెల్యేలకు గతంలోనే కెసిఆర్ హెచ్చరిక చేసారు. అయినా తీరు మారని ఎమ్మెల్యేలకు ఫైనల్ గా ఈ రోజు వార్నింగ్ ఇచ్చారు.

బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సిఎం కెసిఆర్ పార్టి జెండాను ఎగుర వేసి అనంతరం నేతల నుద్దేశించి ప్రసంగం చేశారు.

కొందరు ఎమ్మెల్యేల పద్దతి సరిగా లేదు..దళిత భందు పథకంలో మూడు లక్షల వరకు వసూలు చేశారు....వారి చిట్టా అంతా నాదగ్గరుంది. వారు పద్దతి మార్చుకోవాలి...మళ్లీ రిపీట్ అయితే టికెట్ కూడ దక్కదు. పార్టు నుండి కూడ సస్పెండ్ చేస్తాం... అంటూ కెసిఆర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు కాక పోయినా తమ అుచరులు డబ్బులు వసూలు చేసినా ఎమ్మెల్యేలదే బాద్యతన్నారు.

స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ టి రాజ్య, ఎ్మమెల్సి కడియం శ్రీహరి ఇద్దరూ తరుచూ గొడవలతో రచ్చకెక్కడం సరికాదని వ్యక్తి గత ప్రతిష్టకు వెళ్లకుండా పార్టీ కోసం పనిచేయాలని సిెం కెసిఆర్ సూచించారు.



ఎన్నికలలో పార్టి అనుసరించ నున్న వ్యూహాన్ని కెసిఆర్ నేతలకు వివరించారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు.  తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయ పంథాలో సాధించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ  పార్లమెంటరీ పంథాలో దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి రావడమే బిఆర్ఎస్ ముందున్న లక్ష్యమన్నారు.


తెలంగాణ రాష్ట్రంలో అమలైన పథకాలు దేశంలో ఎక్కడా అమలు కాలేదన్నారు. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో విజయ వంతం అయిన పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు.

అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులందరిని ఆదుకుంటామన్నారు. రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని మక్కలు, జొన్నలు మార్క్ ఫెడ్ ద్వారా ఖరీదు చేసే విదంగా ఆదేశాలు ఇస్తామన్నారు.




కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైపోయిందని అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికలలో గెలిచే సత్తా ఎటూ లేదు కనుక, ప్రజల దృష్టిని మళ్లించటం కోసం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే దుర్మార్గమైన ఎత్తుగడతో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నదని పార్టి సమావేశంలో నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు... ఈ విద్వేషకర వాతావరణం ఈ విధంగానే కొనసాగితే దేశం 100 సంవత్సరాలు వెనక్కు పోవడం ఖాయమని దేశం ఒకసారి తిరోగమనం బాట పడితే, తిరిగి కోలుకోవడానికి మరో 100 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు.
మతోన్మాద శక్తుల దుష్పరిపాలన వల్ల అటువంటి దుర్గతి మన దేశానికి పట్టకుండా ఉండాలంటే దేశ యువత వెంటనే కార్యక్షేత్రంలోకి దిగాలని బిఆర్ఎస్ విస్తృతసభ పిలుపునిచ్చింది. మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్న ఆటవిక, అనాగరిక, అరాచక సంస్కృతిని రూపుమాపేందుకు, ద్వేషం స్థానంలో ప్రేమను, అసహనం స్థానంలో సామరస్యాన్ని, అలజడి స్థానంలో ప్రశాంతతను ప్రతిష్ఠించేందుకు భారతీయ పౌరులందరూ ఏకం కావాలని బిఆర్ఎస్ విస్తృత సభ తీర్మానించింది.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు