డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపిన 1743వాహనాలు సీజ్ చేసిన పోలీసులు


వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్


ఏలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపిన 1743 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది.


ఇందులో భాగంగా గత జనవరి మాసం నుండి కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనాలు వాహనదారులపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా ఈ సంవత్సరం . నడిపే ప్రారంభం నుండి ఈ నెల 9వ తేది వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వాహనదారులకు చెందిన 1743 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. జనవరి మాసంలో 471 వాహనాలు, ఫిబ్రవరిలో మాసంలో 944, మార్చ్ నేటి వరకు 294 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోని కేసులను నమోదు చేసారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో మైనర్ డ్రైవర్లకు చెందిన 98 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు, వాహన యజమానులపై పోలీసులు కేసులను నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అదనపు డిసిపి పుష్పా, ఏసిపి మధుసూధన్ అధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక తనీఖీల్లో వరంగల్ ట్రాఫిక్ విభాగంలో 505, హనుమకొండ 300, కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 320 వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకోని కేసులను నమోదు చేసారు.



స్వాధీనం చేసుకున్న వాహనాలను వాహన యజమాని తిరిగి పొందాలంటే లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన డ్రైవర్కు రోడ్డు రవాణా శాఖ నుండి జారీ కాబడిన లర్నింగ్ లైసెన్స్ కాపీని కోర్టులో సమర్పించడంతో పాటు వాహన యజమానికి కోర్టు విధించిన జరిమానాను చెల్లించి, ట్రాఫిక్ పోలీసులు పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహించే కౌన్సిలింగ్ తరగతులకు వాహన డ్రైవర్ ప్రత్యక్షంగా హజరయిన అనంతరం వాహన యజమానికి వాహనం అందజేయబడుతుందని, ఒక వేళ మైనర్ డ్రైవర్ అయితే జువైనల్ కోర్టు ముందు మైనర్ డ్రైవర్ను హజర్పర్చడంతో పాటు, వాహన యజమానికి కోర్టు విధించిన జరిమానాను చెల్లించి కౌన్సిలింగ్ హజరా కావల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.


ఈ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రతి వాహనదారుడు తమ వంతు సహకారాన్ని అందించాల్సిన బాధ్యత వాహనదారులపై వుందనీ. ఎలాంటి వాహన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ వాహనదారులకు తెలియజేసారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు