దగాపడుతున్న సమాజానికి జర్నలిస్టు రక్షణగా నిలవాలి


-


జర్నలిస్టుల కు  ఇళ్లస్థలాలు గృహలక్ష్మి అమలుకు కృషి

- జర్నలిస్టుల శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యేలు గాదరి కిషోర్,  బొల్లం మల్లయ్య యాదవ్

- విలువలతో కూడిన జర్నలిజాన్ని ప్రజలకు అందించాలి : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

 దగా పడుతున్న సమాజానికి గార్డుగా ఉండాల్సిన జర్నలిస్టు తన ఐడెంటి కార్డును గార్డుగా వాడుతున్నారని ఆ పరిస్థితి నుంచి జర్నలిస్టులు బయటకు రావాలని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎస్వి డిగ్రీ కళాశాల ఆర్టిటోరియంలో ఏర్పాటు చేసిన సూర్యాపేట జిల్లా జర్నలిస్టుల శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులు సమాజానికి రక్షణ కవచాలుగా ఉండి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలన్నారు.  ప్రజాప్రతినిధులు నాయకులకు తెలియని ఎన్నో సమస్యలు పేపర్లలో వస్తాయని అలా వచ్చిన కొన్ని సమస్యలను తాము పరిష్కరించామని అన్నారు.  ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేయాలన్నారు.  జర్నలిస్టులు సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపకరిస్తాయని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  జర్నలిస్టుల సమస్యలన్నీ నాకు తెలుసని ముఖ్యంగా వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేసేందుకు కృషి చేస్తానన్నారు. కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ జర్నలిస్టులు అందరూ మా కుటుంబ సభ్యులు అని మీరు వేరు మేము వేరు కాదన్నారు. నవ్వుతూ కనిపించే జర్నలిస్టుల జీవితాల్లో ఉన్న సమస్యలన్నీ తనకు తెలుసన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను వెలికి తీసేందుకు ఎన్నో ఇబ్బందులు ఒత్తిళ్లు ఉంటాయని  అవన్నీ అధిగమిస్తూ నమ్మిన వృత్తిలో రాణిస్తూ వృత్తికి న్యాయం చేయాలన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్,  ఎస్సీ జర్నలిస్టులకు దళిత బందును వర్తింపజేసేందుకు కృషి చేస్తానన్నారు.  జర్నలిస్టులు ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు అవసరమైతే బ్యాంకారులతో మాట్లాడి రుణాలు అందించేందుకు తమ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని కరోనా సమయంలో ఎంతోమంది జర్నలిస్టులకు సహాయం అందించినట్లు గుర్తు చేశారు. సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మీడియా పాత్ర కీలకమని అన్నారు. జర్నలిస్టులు తలచుకుంటే ఏదైనా చేయగలరని అన్నారు జర్నలిస్టులో తమ వార్తల్లో నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావాలన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ సారధ్యంలో జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. సూర్యపేట జిల్లా కేంద్రంలో అకాల మరణం చెందిన రిపోర్టర్లను ఆదుకున్న మని  తెలిపారు. కోవిడ్ సమయంలో సైతం కోవిడ్ బారిన పడిన ఎంతోమంది జర్నలిస్టులకు పరిహారం అందించడం జరిగిందన్నారు. జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించింది పెంపొందించుకునేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ నైపుణ్యత,విలువలతో కూడిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూనే పాత్రికేయ రంగంలో మెరుగైన సేవలు అందించాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాత్రికేయులకు అన్ని అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు.  సాంకేతిక అభివృద్ధి చెందిన నేపథ్యంలో పాత ఆలోచనలను మార్చుకుంటూనే కొత్త ఆలోచనలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని  భవిష్యత్ లో డిజిటల్ మీడియా పైనే దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి అలాగే ఈ ప్రాంతం నుండి ఎంతో మంది విశిష్టతమైన అనుభవం ఉన్నవారు గొప్ప స్థానాల్లో ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మీడియా అకాడమీ ద్వారా ఇప్పటి వరకు 10 చోట్ల ఆరు వేల మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలంగాణలో 40 వేళా పైగా పాత్రికేయులు అక్రిడేషన్ కార్డులు అందించడం జరిగిందని తెలిపారు.  తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో  పాత్రికేయుల శిక్షణా కార్యక్రమంతో మారుతున్న సమజాంలో పాత్రికేయుల పాత్ర, పత్రికా జర్నలిజం, టి.వి. జర్నలిజం, డిజిటల్ మీడియా తదితర అంశాలపై  సీనియర్ పాత్రికేయులు మల్లేశం,గంటా ప్రసాద్, దిలీప్, గౌరీ శంకర్ లతో ప్రత్యేక తర్ఫీదు అందించనున్నట్లు తెలిపారు.  మారుతున్న కాలానికి అనుగుణంగా ముందుకు పోవాలంటే  నాణ్యత విలువలతో కూడిన జర్నలిజం పై శిక్షణ చాలా అవసరమని చెప్పారు. మీడియా బాధితులు పక్షాన న్యాయం జరిగే విధంగా  వార్తలు ఉండాలని అన్నారు. మీడియా అకాడమీ ద్వారా పాత్రికేయులకు శిక్షణా కార్యక్రమాల్లో  వార్తల సేకరణపై తయారు చేసిన పుస్తకాలను   అందచేశారు. ఈ  కార్యక్రమంలో డి.సి.యం.యస్ చైర్మన్ వట్టే జనయ్య యాదవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ   చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,  మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, మేనేజర్ వెంకటేశ్, పిఆర్ఓ వనజ, ఓఎన్డీ రహమాన్ , ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గుండా  శ్రీనివాస్ గుప్తా,  టీయూడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా అధ్యక్షులు వజ్జే వీరయ్య, ఐతగొని రాంబాబు, పాల్వాయి జనయ్య, సంఘాల మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు