పిజి వైద్య విద్యార్థిణి సూసైడ్ కేసులో నిందితుడు సైఫ్ అరెస్ట్

 


కాకతీయ మెడికల్ కాలేజి పిజి వైద్య విద్యార్థిణి ప్రీతి సూసైడ్ కేసులో నిందితుడు సైఫ్ ను పోలీసులు శుక్రవారం అరెస్ట్  చేశారు.

సైఫ్ కావాలనే ప్రీతిని వేధించినట్లు  వాట్సాఫ్ ఛాట్ ద్వారా తెల్సిందని పోలీస్ కమీషనర్ రంగనాధ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రీతి తన స్నేహితులతో ఎక్కువ చేస్తున్నట్లు మెసేజ్ చేశాడని ఎందుకు వేధిస్తున్నావంటూ ప్రీతి బదులుగా మెసెజ్ చేసిందని తెలిపారు.ప్రీతి మానసికంగా ఇబ్బంది పడినందువల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అన్నారు.ప్రీతి సక్సీ నైల్ కోలీన్ అనే ఇంజక్షన్ కోసం గూగుల్ లో సర్చ్ చేసిందన్నారు. ఆమె గదిలో ఈ ఇంజక్షన్ దొరికిందన్నారు.

ప్రీతి బ్లడ్ షాంపూల్స్ పరీక్షలకు పంపించామని టాక్సికాలజి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత  నిర్దారిస్తామని చెప్పారు. ప్రీతి ఆత్మహత్యా యత్నానికి సైఫ్ వేధింపులే కారణమని నిర్దారించామన్నారు. ఈ కేసులో లాంటి రాజకీయ  కోణాలు లేవన్నారు.

పోలీసులు సకాలంలో స్పందించలేదన్నది అవాస్తవమన్నారు. ఈ కేసులో  వాట్సాప్ లో వేధించడం కూడ ఓ రకమైన రాగింగ్ కిందకే వస్తుందన్నారు. ఈ కేసులో రాగింగ్ కన్నా బాసింగ్ అనేది ప్రధానంగా ఉందన్నారు. 

కాలేజీలో రాగింగ్ జరుగుతోందా అనే విషయాలపై ఇంకా విచారిస్తున్నామని ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో మాట్లాడతామని అన్నారు.

ప్రీతి కేసులో పోలీసుల వైపు నుండి ఎలాంటి నిర్లక్,్యం లేదన్నారు. ప్రీతి తండ్రి ఓరల్ గా పోలీసుల హెల్ప్ అడిగారని పోలీసులు సరైన రీతిలో స్పందించారని కమీషనర్  తెలిపారు.

ఆందోళనకు దిగిన వైద్య విద్యార్థులు

ఇదిలా ఉంటే వైద్య విద్యార్థులు సైఫ్ పై కేసులు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. సైఫ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసులు నమోదు చేయడం సరైంది కాదన్నారు. అత్యవసర విభాగాల విధులు మినహా  ఓపి  విధులు బహిష్కరించారు. ఎంజిఎం ఆసుపత్రి ఎదుట ఆందోళన జరిపారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా కేసులెట్లా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ప్రీతి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం విచారకరమన్నారు.  సైఫ్ కు న్యాయం చేయాలని లేదంటే సమ్మె కు దిగుతామంటూ సూపరింటిండెంట్ కు లేఖ ఇచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు