గరం గరంగా గరికపాటి - కూల్ గా చిరంజీవి

అలయ్ బలయ్ లో 

చిరంజీవిపై గరికపాటి అసహనం -  ఏపాటివాడైనా అంటూ నాగబాబు ట్వీట్ 




హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పిటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి ఫోటో సెషన్ చూసి గరికపాటి నరసింహారావు అసహనానికి గురయ్యారు. 

గరికపాటి తన ప్రసంగం ప్రారంభ దశలో ఉండగా చిరంజీవి చుట్టూ అభిమానులు గుమి గూడి సెల్ఫీలు దిగే హడావుడి జరుగుతుండడంతో అది చూసి గరికపాటి గరం గరంగా మాట్లాడారు. 

"అక్కడ మొత్తం పోటోల సెషన్ ఆగి పోతే నేను మాట్లాడతానండి... లేపోతే నేను వెళ్లి పోతాను... నాకు ఏం మొహమాటం లేదు.. అక్కడ ఆపెయ్యాలి చిరంజీవి గారు దయచేసి ఈ పక్కకు రాండి నేను మాట్లాడతాను... చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి..లేక పోతే నాకుసెలవు ఇప్పించండి అంటూ గరికపాటి అసహనంతో విజ్ఞప్తి చేశారు. 

అలయ్ బలాయ్ కార్యక్రమానికి  అనేక మంి ప్రముఖులు హాజరయ్యారు.  గరికపాటి కి వేదికపై ఉన్న వారు సర్ది చెప్పారు. కొద్ది సేపటి తర్వాత చిరంజీవి అభిమానుల నుండి బయట పడి వేదికపైకి వచ్చారు. గరికి పాటిని పలకరించి నమస్కారం చేశారు. ఆ తర్వాత గరికపాటి తన ప్రసంగాన్ని కొనసాగించారు.



తన ప్రసంగంలో గరికపాటి  ఆలయ్ బలాయ్ ఉద్దేశాన్ని వివరించారు. మనం మనుషులం  అనే ప్రాథమిక ఉద్దేశాన్ని గుర్తు చేయడమే మన ఉద్దేశం. దేహం మీద ప్రేమను విడిచిపెట్టినప్పుడే దేశం కోసం అందరం ఏకమవుతాం. లేకపోతే కులం, మతం పేరుతో తన్నుకుచస్తాం. మనిషిని మనిషిగా ప్రేమించాలి. అలయ్ బలయ్ ఉద్దేశం కూడా అదే. చిరూ గారి దగ్గర ఉన్నాను కాబట్టి చిరు సందేశం ఇస్తున్నాను తన దైన ధోరణిలో  గరికపాటి చలోక్తి విసిరారు.


ఆనంతరం చిరంజివి తన ప్రసంగంలో  గరికపాటిని అప్యాయంగా పలకరించి అతని గురించి ప్రశంసనీయంగ మాట్లాడారు.  గరికపాటి ప్రసంగాలు క్రమం తప్పకుండా వింటుంటానన్నారు. రికపాటి ప్రవచనాలను తాను ఎంతగానో ఇష్టపడతానని చిరంజీవి అన్నారు. ఆయణ్ని ప్రత్యక్షంగా చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలిపారు. గరికపాటికి పద్మశ్రీ వచ్చినప్పుడు అభినందనలు తెలిపాని ఆయన గుర్తు చేశారు. ‘భవిష్యత్తులో అవకాశం ఉంటే మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి ఆహ్వానించుకుంటాను’ అని చిరంజీవి అన్నారు.


ప్రేమను ఎంత ఇస్తామో, అంతే తిరిగి తీసుకుంటామని చిరంజీవి పేర్కొన్నారు. తాను దాన్నే నమ్ముతానని, ఎప్పటి నుంచో ఆచరిస్తున్నానని ఆయన చెప్పారు‘రాజకీయాల్లోకి వచ్చాక రక్తం అమ్ముకొని జీవిస్తున్నాడని తనపై విమర్శలు చేశారని కాని తాను స్పందించలేదుని  సత్యం తెలుసుకున్నాక వాళ్లే మన  దగ్గరికి వస్తారని నమ్మానుని  చివరికి అదే నిజమైందని  ప్రేమకు ఉన్న ప్రభావం అఁత గొప్పదని  ప్రేమతోనే ఏదైనా జయించాలని అలయ్ బలయ్ ఉద్దేశం కూడా అదేనని చిరంజీవి వివరించారు.


ఇక గరికపాటికి చిరంజీవికి మద్య  ఆలయ్ బలాయ్ కార్యక్రమంలో జరిగిందేదో జరిగి పోయిందని ఇద్దరు ప్రశాంతంగా సర్దుకు పోగా చిరంజీవి సోదరుడు నాగబాబు మాత్రం తన ట్వీట్ తో పొగ పెట్టారు. "ఏపాటి వాడికైనా  చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి  అసూయ పడటం పరిపాటే ..నాగ బాబు చేసిన ట్వీట్ బాగా వైరల్ అయింది. గరికపాటి చిరంజీవి పట్ల అసహనం వ్యక్తం చేయడం బహుశా నాగబాబుకు నచ్చి ఉండక పోవచ్చు. 

ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆగుతుందా లేక ములుపులు  తిరిగుతుందా ఇప్పుడే చెప్పలేం.

గరికపాటి వారు కొంచెం సహనం పాటిస్తే సరిపోయేది. అనవసరంగా నోరు జారాడనే విమర్శలు కూడ మొదలయ్యాయి.  స్టార్ ఇమేజ్ కలిగిన నటుడు కనిపిస్తే సెఎక్కడైనా సెల్పీల కోసం అభిమానులు 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు