యాదగరిగుట్టలో సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు

 


యాదగిరిగుట్ట  లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  తన కుటుంబ సబ్యుల సమేతంగా  శుక్రవారం దర్శించుకున్నారు. కేసీఆర్‌కు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఈ సందర్భంగా ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ఒక కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందించారు. కెసిఆర్ మనవడు హిమాన్షు చేతుల మీదుగా బంగారం అంద చేయించారు. స్వామి వారికి ముఖ్యమంత్రి ఆయన సతీమని శోభ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. 


స్వామి వారికి సమర్పించేందుకు నెత్తిన బంగారు కానుకతో ముందు వరుసలో నడుస్తున్న సిఎం కెసిఆర్  మనవడు హిమాన్షు

స్వామి వారి దర్శనానికి ముందు యాదాద్రి కొండ దిగువన ఉన్న ప్రెసిడెన్సియల్ సూట్ లో వైటీడీఏ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సత్యనారాయణ వ్రత మండపం, గండి చెరువు ఆధునికీకరించే పనులు, వాటి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు

ముఖ్యమంత్రి రోడ్ మార్గం గుండా యాదగిరిగుట్టకు వెళ్లే షెడ్యూల్ ఖరారు కావడంతో నగరంలో ఆయన ప్రయాణించే దారి పొడవునా ఆంక్షలు విధించారు. ఎన్‌ఆర్‌జీఐ మెట్రోస్టేషన్‌, ఉప్పల్‌ ఎక్స్‌రోడ్‌, బోడుప్పల్‌, మెక్‌డొనాల్డ్స్‌, ఘట్‌కేసర్‌, బీబీనగర్‌, యాదగిరిగుట్ట వరకు ఉదయం 11 గంటల నుండి మాద్యాహ్నం 4 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో ఆ మార్గంలో వాహన దారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సిఎం పర్యటించే మార్గంలో కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించడంతో వాహన దారులు విసుక్కున్నారు. 

ఎంతో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, చిలుమర్తి లింగయ్య, సుధీర్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఈవో గీతారెడ్డి ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు