సార్ ఇమానం మోత-ఎవడి పాలయ్యిందిరో అన్న రేవంత్

 


సిఎం కెసిఆర్ విమానం కొనడం దేశ వ్యాప్తంగ తిరగడమేమో కాని సోషల్ మీడియాలో సెటైర్లు బాగ ట్రెండ్ అవుతున్నాయి. విపక్ష నేతలు సైతం సార్ విమానంపై సెటైర్లు విసిరారు.  

సీఎం కేసీఆర్  విమానం కొనుగోలుపై రేవంత్ రెడ్డి  సెటైరికల్ ట్వీట్ చేశారు. ఎవని పాలయిందిరో తెలంగాణ అంటూ దేశ దిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడంటూ ట్విటర్  వేదికగా ఎద్దేవా చేశారు.
అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏ నాడు పరామర్శించ లేదు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు... ఫాంహౌస్  దాటింది లేదు. ఇప్పుడు దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట! ఎవని పాలయ్యిందిరో తెలంగాణ...!! అని రేవంత తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


సీఎం కేసీఆర్ దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నాడంటు ఇప్పటికే వార్తలు వచ్చాయి. జాతీయ పార్టీ అధినేతగా దేశవ్యాప్త పర్యటనల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేశారు. పార్టీలోని పది మంది నాయకులు ఈ విమానం కొనుగోలు కోసం విరాళాలు ఇచ్చారు. విరాళాలు ఇచ్చిన నేతల్లో ముగ్గురు ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు కాగా.. ఒకరు నల్లగొండ జిల్లా, మరొకరు కరీంనగర్‌ జిల్లాకు చెందినవారు ఉన్నట్టు ఓ వార్త పత్రిక కథనం వెల్లడించింది.  వీటన్నింటినీ బట్టి జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా కొనసాగుతున్నాయని అర్దం అవుతోంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు