కత్తి మహేశ్ మృతి కేసు వెనకాల కుట్ర కోణం ఉందా ?


అనుమానాలు వ్యక్తం చేసిన మంద కృష్ణ మాదిగ
విచారణ ప్రారంభించిన పోలీసులు


సిని విమర్శకుడు కత్తి మహేశ్ మృతి వెనకాల కుట్ర ఉందా...అవునని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మృతిపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు.  ఇటీల కత్తి మహేశ్ నెల్లూరు సమీపంలో రోడ్డు ప్రమాదానికు గురయ్యాడు. అతన్ని స్థానిక అసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం చెన్నైకి తరలించి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. చికిత్స పొందుతు కత్తి మహేశ్ మరణించాడు.

మహేశ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. గతంలో ఆయనపై పలు సందర్భాల్లో దాడులు జరిగాయి.  కత్తి మహేశ్ ను మను వాదులు మతోన్మాదులు టార్గెట్ చేశారు. 

తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ విచారణ జరిపించి న్యాయం చేయాలంటు కత్తి మహేశ్ తండ్రి ఓబులేషు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.  మందకృష్ణ ఎపి సర్కార్ పై తివ్ర విమర్శలు చేసారు. కత్తి మహేశ్ మరణిస్తే కనీసం సిఎం సహా మంత్రులు నివాళులు అర్పించ లేదన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంద కృష్ణ న్యాయ విచారణకు డిమాండ్ చేసారు. కత్తి మహేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ, జగన్ కోసం ప్రచారం చేశారని, అలాంటి వ్యక్తి చనిపోతే సీఎం జగన్ కనీసం సంతాప ప్రకటన కూడా చేయలేదని మందకృష్ణ విమర్శించారు. మహేష్ భౌతిక కాయానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహా ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా నివాళులర్పించకపోవడం అన్యాయమని దుయ్యబట్టారు. దళితులంటే ఇంకా చులకన భావమే ఉందని, గౌరవం, గుర్తింపు ఇవ్వబోరని మరోసారి అర్థమైందని మందకృష్ణ అన్నారు. 

దాంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. డ్రైవర్ సురేష్ ను విచారించారు. ప్రమాదంలో కత్తి మహశ్ తీవ్రంగా గాయపడి డ్రైవర్ వైపు ప్రమాదం జరగ పోవడం ఆతనికి చివన్న గాయం కూడ ఎందుకు కాలేదనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.   రోడ్డు ప్రమాదం జరిగిన తీరు నుండి అసుపత్రిలో జరిగిన చికిత్స వరకు అన్ని విషయాలపై పోలీసులు విచారణ జరపనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు