మరియమ్మ లాకప్ డెత్ పై సిఎం ను కల్సిన కాంగ్రేస్ పార్టి నేతలు

 


ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ వర్గాలను ఆశ్చర్య గొలుపుతూ  ప్రతిపక్ష కాంగ్రేస్ పార్టి నేతలకు తొలిసారిగా అప్పాయింట్ మెంట్ ఇచ్చాడు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కు గురైన మరియమ్మ విషయాన్ని కాంగ్రేస్ పార్టి నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆయన అప్పాయింట్ మెంట్ కోరగా శుక్రవారం సాయంత్రం వారికి అప్పాయింట్ మెంట్ ఇచ్చాడు.

కాంగ్రేస్ పార్టి సీనియర్ నేత భట్టి విక్రమార్కతో పాటు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు సిఎం కెసిఆర్ ను కల్సిన వారిలో ఉన్నారు. ప్రగతి భవన్ లో సిఎం కెసీఆర్ ను కలిసారు.

ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మ   ఓ చర్చి ఫాస్టర్ ఇంట్లో వంట మనిషిగా పనిచేసేది. ఫాస్టర్ ఇంట్లో రెండు లక్షల రూపాయల చోరి జరిగిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరియమ్మను ఆమె కుమారుడిని పోలీసులు చిత్ర హింసల పాలు చేశారు పోలీసులు కొట్టిన దెబ్బలకు మరియమ్మ చనిపోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంభందించి  అధికారులు ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.

మరియమ్మ లాకప్ డెత్ విషయంలో సంభందిత పోలీసులపై ఖఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని కోరినట్లు కాంగ్రేస్ పార్టి నేత భట్టి విక్రమార్క తెలిపారు. మరియమ్మ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని భట్టి తెలిపారు. అంతేకాక, మరియమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని కూడా కేసీఆర్ అన్నారని చెప్పారు.

ఎస్సీ మహిళ అయిన మరియమ్మ పోలీస్‌ లాకప్‌లో దారుణంగా చనిపోయిందని సీఎంకు వివరించాం. రాష్ట్రంలో ఎస్సీలు, గిరిజనులపై జరుగుతున్న దాడులను కూడా సీఎంకు వివరించాం. మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశాం. మరియమ్మ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని డీజీపీని సీఎం ఆదేశించారు. లాకప్‌ డెత్‌ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. మరియమ్మ కుటుంబానికి ఇల్లు కేటాయిస్తామని, ఆమె కుమార్తెలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని సీఎం తెలిపారు.


ఆమె బిడ్డలకు రూ.10 లక్షల చొప్పున సాయం చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. మరియమ్మ కుమారురుడు ఉదయ్‌ కిరణ్‌కు రూ.15 లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరగా.. అందుకు సీఎం ఒప్పుకున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరాం’’ అని భేటీ వివరాలను మీడియాతో భట్టి విక్రమార్క తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు