తిరుపతిలో చంద్రబాబు సభపై రాళ్లు విసిరిన దుండగులు

 


తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగు దేసం పార్టి చీఫ్ చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో రాళ్లు విసిరారు. సోమవారం రాత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా పురం కూడలిలో ప్రసంగిస్తుండగా రాళ్లు విసిరారు. ఓమహిళతో పాటు మరో యువకుడు గాయపడ్డారు. దాంతో చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు పై రాళ్లు విసిరిన వారికి రండిరా... నా తడాఖా చూపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. రౌడీ రాజ్యం అంటూ చంద్రబాబు నాయుడు సభకు హాజరైన వారి చేత నినాదాలు ఇప్పించాడు.

 జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రత కలిగిన తన సభకు పోలీసులు సరైన రక్షణ కల్పించ లేదన్నారు.  తన పరిస్థితే ఇట్లా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాళ్ల దాడిలో గాయడిన వారిని పరామర్శించారు. అనంతరం వాహనం దిగి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. 

తర్వాత అక్కడి నుండి ర్యాలీగా ఎస్పి కార్యాలయం వరకు వెళ్లారు. చంద్రబాబు నాయుడు వెంట పార్టి కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీలో కదిలారు. అయితే చంద్రరాబు నాయుడును పోలీసులు ఎస్పి కారాయలయం బయటే నిలిపి వేశారు. లోనికి అనుమతించక పోవడంతో పోలీసులపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపపు ఎస్పి సుప్రజ బయటకి వచ్చి  చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. 

తాను ప్రచారానికి వద్దామనుకుంటే సభకు జనం వస్తారో రారో అన్న అనుమానంతో పరువుపోగొట్టుకోవడం ఎందుకని పర్యటన రద్దు  చేసుకున్న జగన్ రెడ్డి... చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజలను చూసి బెంబేలెత్తి పోతున్నట్టు ఉంది. ఈరోజు తిరుపతి ప్రచారంలో ఉన్న చంద్రబాబుపై వైసీపీ రౌడీలతో రాళ్లు వేయించారని తెలుగు దేశం పార్టి ఆరోపిస్తు ట్వీట్ చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు