ప్రకాశించే రాజు-ఈ నటరాజు..!

 


ప్రకాశించే రాజు

ఈ నటరాజు..!


ఎప్పుడు వచ్చాడో..

కళ్ళు మూసి తెరిచేలోగా 

స్టార్ అయిపోయాడు..

తమిళ,కన్నడ,మలయాళ..

హిందీ..అన్నిటినీ మించి తెలుగులో..

ఏ సినిమాలో చూసినా అతడే..

ఏ పాత్ర వెయ్యాలన్నా 

అతనొక్కడే..!


ఒకనాడు ఎస్వీఆర్ 

వేసిన పాత్రలు..

మరోనాడు గుమ్మడి 

చేసిన కారెక్టర్స్..

ఓ రాజనాల..

సత్యనారాయణ..

సీరియస్..కామెడీ..

విలనీ..వీటన్నిటి కలగలుపు..

ఆయన పాత్ర సినిమాకు

మేలిమలుపు..!


చిరు,బాలయ్య..

వెంకీ..నాగ్ నుంచి

మహేష్ బాబు,రాంచరణ్..

ప్రభాస్,బన్నీ..

హీరో ఎవరైనా గానీ 

ఉండాల్సిందే

ప్రకాష్ రాజ్..

ఆధునిక సినిమా చరిత్రలో 

ఆయనొక చిత్రమైన రారాజ్..

కమల్,రజనీకాంత్ లా

బాలచందర్ అందించిన 

విలక్షణ నటుడు..

*_గుప్పెడుమనసు_* తోనే 

*_ఆకాశమంత_* 

కీర్తి గడించిన

*_గోవిందుడు అందరివాడే..!_*


ఏం నటుడండీ..

నాన్నగా కనిపిస్తే ప్రేమ కురిపిస్తాడు..

ఆడపిల్ల తండ్రిగా 

అయితే మరీనూ..

ఒక్కోసారి మాత్రం 

మోనార్కులా 

*_ఇడియట్_* పై

పగబట్టేస్తాడు...

మొత్తానికి 

తండ్రి పాత్రల్లో 

ఆయనది ఓ ప్రత్యేక శైలి..

ఆయనగారే 

చెప్పుకున్నట్టు 

ఫాదర్ ఆఫ్ ది నేషన్..

ఈ టాలీవుడ్ సెన్సేషన్...

వయసుకు మించిన 

తాత పాత్రలోనూ 

పరిణితే..

మనవడిపై ప్రేమవరదే..

మాతృభాష ఏదైనా 

ఈ పితృదేవుడికి 

అన్ని భాషలూ 

మాతృభాషలాగే..

మంచి ఉచ్చారణ..

స్పష్టత..

చక్కని గొంతు..

*_వినోదం_* పంచిన 

ఈ *_టూ ఇంటిలిజెంట్_* సొత్తు..

ఈయన స్వరం వింటేనే 

అదోలాంటి మత్తు...

ఈ మధ్య పోటీ పెరిగినా 

ఈ విలక్షణ నటుడికి 

కారెవరూ సాటి..

నటుడుగా ఆయన ఒక్కడు..

వ్యక్తిగా కూడా కాస్త వెరైటీ..

పుట్టినరోజు సందర్భంగా 

మన ప్రకాష్ రాజ్ కు చెప్దాం

*_శతమానంభవతి..!_*


విలక్షణ నటుడు 

ప్రకాష్ రాజ్ కు పుట్టినరోజు

శుభాకాంక్షలతో..

*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*

    9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు