జె ఎన్ టి యు లో కంప్యూటర్ సైన్స్,ఇంజనీరింగ్ విభాగంలో అ సిస్టెంట్ ప్రొఫెస ర్ గా పనిచేస్తున్న పుప్పాల తిరుపతికి కాకతీయ యూనివర్సిటీ వరంగల్ (కేయూ) పరీక్షల నియంత్రణ అధికారి పీహెచ్‌డీ డిగ్రీని ప్రదానం చేసినట్లు కిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు.
"ఏ నావెల్ క్లౌడ్ సర్వీస్ మోడల్ ఫర్ ఐఓటీ సపోర్టడ్ బిగ్ అగ్రికల్చర్ డేటా అనలిటిక్స్" పేరుతో తిరుపతి తన పరిశోదనా పత్రాన్ని కె యు వరంగల్ పరీక్షల విభాగానికి సమర్పించారు.
కిట్సో లో ప్రొఫెసర్,హెడ్ పోలాల నిరంజన్ రెడ్డి పర్యవేక్షణలో తిరుపతి పరిశోధనచేసారు.
తన పరిశోధనలో తిరుపతి ఐఓటీ పరికరాల సరైన ప్లేస్‌మెంట్‌ని ఉపయోగించి వ్యవసాయ క్షేత్రాన్ని విశ్లేషించడానికి ఆటోమేటిక్ ప్రాసెస్ కోసం ఒక వినూత్న సాంకేతిక విధానాన్ని అభివృద్ధి చేశారు.
అంతే కాకుండా అతను రిగ్రెషన్-ఆధారిత విశ్లేషణను ఉపయోగించి ఐఓటీ నెట్‌వర్క్‌లో సమయ సమర్ధవంతమైన క్లస్టర్ హెడ్ నోడ్ ఎంపిక వ్యూహం బ్యాలెన్స్‌డ్ వర్క్‌లోడ్ పంపిణీని విధానాన్ని కనుగొన్నారు.
ALSO READ పరిశోదకులకు పనికొచ్చే సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ పుస్తకం "మూడు దారులు"
రాజ్య సభ మాజి సబ్యులు కిట్స్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మికాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి, అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ తిరిపతిని ఇందుకు తోడ్పడిన గైడ్ ప్రొ. పి నిరంజన్ రెడ్డి ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం కోమల్ రెడ్డి, ప్రొఫెసర్ & సి యస్ ఈ విభాగపు హెడ్, డా. పొలాల నిరంజన్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, వివిధ విభాగాల డీన్ లు అండ్ విభాగాధిపతులు అధ్యాపకులు, సిబ్బంది మరియు హెడ్, ఫిజికల్ సైన్సెస్ & కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ డి. ప్రభాకరా చారి, డా శ్రీనివాస్ చింతకింద, డా వెంకట్రాములు తదితరులు అభినందనలు తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box