ఓటును ఓడిపోనివ్వకు..!

 ఓటును ఓడిపోనివ్వకు..!



చెడుపై మంచి గెలుపు

దీపావళి పిలుపు..


నువ్వు సామాన్యుడివే..

బలం లేదనుకోకు..

ఓటు నీ ఔటు..

దాంతోనే చెప్పు బుద్ధి..!


పోలింగ్ కేంద్రం దేవాలయం

ఓటును అమ్మిన

మకిలి చేతులతో 

అడుగుపెట్టొద్దు..,!


నువ్వు ఓటేసే నేత

తాను జువ్వలా ఎగసి

నిన్ను భూచక్రంలా

గిరగిరా తిప్పేస్తాడు..!


అభ్యర్థుల వాగ్దానాలు

పేలని బాంబులు..

పొగ ఎక్కువ..

నిజాయితీ తక్కువ..!


గెలిచిన తర్వాత 

నిన్ను గోడకేసి కొట్టడా నేత

అప్పుడు నువ్వు పేలినా

ఏంది లాభం..?


దీపావళి ఏడాదికోసారి..

ఓటు పండగ ఐదేళ్లకే మళ్లీ

అందుకే జర భద్రం..

లేదంటే భవిత ఛిద్రం!


అక్రమార్కుడికి వేసే ఓటు

చీదేసిన పటాకీ..

నువ్వు కాలితో తన్నేటపుడే

పేలుతుంది జాగ్రత్త..!


ఓటరన్నా..

బడాబాబుల కాడ

అవినీతి బాంబులు..

వెలిగించే అగ్గిపెట్టె 

నువ్వు కావద్దు..!


అదను చూసి వెయ్యి ఓటు..

మర్మమెరిగి పేల్చు ఔటు..

ఒక్కరోజు దీపావళి కాదిది

అయిదేళ్ల ఆనందావళి..!


ఈరోజు దీపావళి ..


నవంబర్ 30..డిసెంబర్ 3..

తెలంగాణ ఎన్నికల పండగ..


ఇప్పుడు అప్రమత్తం..

అప్పుడు వాడు చిత్తం..!


*_సురేష్..9948546286_*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు