కిట్స్ వరంగల్ లో జాతీయ సైన్స్ డే సెలబ్రేషన్స్



సివిల్ సెమినార్ హాల్‌లో "సైన్స్‌లో గ్లోబల్ లీడర్‌షిప్ మరియు ఇన్నోవేషన్ కోసం విక్షిత్ భారత్ కోసం భారతీయ యువతకు సాధికారత" అనే అంశంపై సెమినార్ నిర్వహించారు


కిట్స్ వరంగల్ లో ఫిజికల్ సైన్సెస్ (పి యస్) విభాగము వారు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ & ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ కౌన్సిల్ (ఐఐసి6.O), తో కలిసి సంయుక్తంగా   "సైన్స్‌లో గ్లోబల్ లీడర్‌షిప్ మరియు ఇన్నోవేషన్ కోసం విక్షిత్ భారత్ కోసం భారతీయ యువతకు సాధికారత * అనే అంశంపై  సివిల్ సెమినార్ హాల్‌లో సెమినార్   నిర్వహించారు. 

ఈ కార్యక్రమం ను జాతీయ సైన్స్ డే సందర్భంగా  సివిల్ సెమినార్ హాల్‌లో  లో కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు) లో నిర్వహించారు అని  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు.  దీనిని ముఖ్య అతిథి, ఎన్ఐటీ వరంగల్   కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పత్రి వెంకట శ్రీలక్ష్మి లాంఛనంగా  ప్రారంభించారు.


ఈ సందర్భంగా  ముఖ్య అతిథి,  ఎన్ఐటీ వరంగల్  కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పత్రి వెంకట శ్రీలక్ష్మి  మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను వివరించారు. కొత్త సవాళ్లు మరియు అవకాశాలను ఎదుర్కోవడానికి తాజా పరిశోధన కార్యకలాపాలను ఆమె వివరించారు. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ ఇంజనీరింగ్ మరియు ఆస్ట్రోబయాలజీ యొక్క కొన్ని ఇటీవలి పురోగతులు మరియు అనువర్తనాలను ఆమె వివరించారు. ఘన, వాయు, ద్రవ మరియు జీవ రంగాలకు సంబంధించిన జ్ఞాన వ్యవస్థ కలయిక సైన్స్ అని ఆమె విషదీకరించారు. 



ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యను అభిరుచితో అభ్యసించాలి కానీ పలానా ఇంజనీరింగ్ పేరుతో కాదు” అని తద్వార మీ ఆశయ సాధన తో జీవితం ఫల ప్రదం అవుతుంది అని విద్యార్థులకు సూచించారు.  "మీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారితేనే విజయం"  సాధించినట్లు అని తెలిపారు.


ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యం మాజీ రాజ్య సభ సభ్యులు  కిట్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి  పి. నారాయణ రెడ్డి, మరియు అదనపు కార్యదర్శి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గారు ఫిజికల్ సైన్సెస్ విభాగం కార్యనిర్వాహక  అధ్యాపక బృందంను మరియు విద్యార్థి సమన్వయకర్తల బృందాన్ని జాతీయ సైన్స్ డే ను నిర్వహించినందుకు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో  డీన్‌లు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, హెడ్, ఐస్క్వేర్ ఆర్ ఈ, ప్రొఫెసర్ కె. రాజనరేందర్ రెడ్డి, ఫిజికల్ సైన్సెస్ హెడ్ డాక్టర్ హెచ్. రమేష్ బాబు,  ఎం అండ్ హెచ్  విభాగం హెడ్, డాక్టర్ కె. శివశంకర్, అసోసియేట్ ప్రొఫెసర్లు: డాక్టర్ డి. ప్రభాకర చారి, డాక్టర్ టి. మధుకర్ రెడ్డి, డాక్టర్ సిహెచ్. సతీష్ చంద్ర , ఫ్యాకల్టీ కోఆర్డినేటర్, డాక్టర్ ఇ. కళ్యాణ్ రావు & డాక్టర్ పి. శ్రీనివాస్ రావు మరియు కిట్స్ వరంగల్ NSS మరియు PMC విద్యార్థి ప్రతినిధులు,  అధ్యాపకులు, సిబ్బంది, 200 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు