కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్‌లో ఇన్నోవేషన్ & ఎంట్రప్రెన్యూర్షిప్‌పై ముగిసిన వారం రోజుల FDP
వరంగల్‌లోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (KITSW) లో మార్చి 10 నుండి 15, 2025 వరకు ఐదురోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (FDP) ను నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోకా రెడ్డి తెలిపారు.
ఈ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించిన గ్రాండ్ వాలెడిక్టరీ వేడుకలు KITSW క్యాంపస్‌లోని సిల్వర్ జుబిలీ సెమినార్ హాల్‌లో ఘనంగా జరిగాయి.
ఈ FDP కి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) మరియు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ (MoE’s MIC) స్పాన్సర్ చేశారు.
ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు మరియు KITSW ఛైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత్ రావు, KITSW ఖజాంచి పి. నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మరియు KITSW అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ పాల్గొని, ఈ FDP ను విజయవంతంగా నిర్వహించిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, అండ్ రీసెర్చ్ ఇన్ ఎంట్రప్రెన్యూర్షిప్ (Ci2RE) టీమ్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా KITSW ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోకా రెడ్డి మాట్లాడుతూ, ఈ FDP యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు విజయవంతంగా సాధించామని, కొత్త బోధనా విధానాలు, పరిశోధన విషయాలు, ఆవిష్కరణలు మరియు స్టార్టప్ ఆలోచనలను అభివృద్ధి చేసేందుకు ఇది ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడిందన్నారు. అలాగే, విద్యార్థుల్లో స్టార్టప్ మైండ్‌సెట్‌ను పెంపొందించేందుకు అధ్యాపకులు పరిశ్రమ-విద్యా రంగ అనుసంధానాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మెకానికల్ ఇంజినీరింగ్ విభాగ ప్రొఫెసర్ మరియు Ci2RE హెడ్ డాక్టర్ కె. రాజా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, FDP చివరి రోజున ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించామని, ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయులకు హ్యాండ్స్-ఆన్ యాక్టివిటీస్, కేస్ స్టడీస్, టీమ్ డిస్కషన్స్ ద్వారా ఆచరణాత్మక శిక్షణ అందించామన్నారు. ఈ FDP విద్యావేత్తలకు కొత్త ఆలోచనలు కలిగించే వేదికగా నిలిచిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో FDP కోఆర్డినేటర్ డాక్టర్ కె. రాజా నరేందర్ రెడ్డి, FDP కో-కోఆర్డినేటర్ మరియు ECE అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. రాజు రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ & PRO డాక్టర్ డి. ప్రభాకర చారి, ఇతర అధ్యాపకులు, సిబ్బంది మరియు దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల నుండి వచ్చిన 60 మంది ఫ్యాకల్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box