బోధగయ - మహాబోధిని రక్షించుకుందాం

 


బోధగయ - మహాబోధిని రక్షించుకుందాం

బుద్ధ విహార్ బౌద్ధులచే నిర్వహించాలి


అంబేద్కర్ యువజన యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మధుపాక ఎల్లయ్య


   బోదగయ-మహాబోధి బుద్ధవిహార్ ను బౌద్ధులచే నిర్వహించాలని, బిటి ఆక్ట్ 1949 ని రద్దు చేయాలని అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుపాక ఎల్లయ్య డిమాండ్ చేశారు. బోధగయను రక్షించి బుద్ధ విహార్ ను రక్షించే పూర్తి బాధ్యత బౌద్ధ బిక్షువులకే ఇవ్వాలని బోధగయలో పోరాటం చేస్తున్న బౌద్ధ బిక్షివులకు సంఘీభావంగా హనుమకొండ జిల్లా కేంద్రం, అంబేద్కర్ సెంటర్ గౌతమ బుద్ధ విగ్రహ ప్రాంగణం నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నిరసన ధర్నా లో ఆయన పాల్గొని మాట్లాడారు. సిద్ధార్థుడు బోధి వృక్షం కింద ధ్యానం చేసి జ్ఞానోదయం పొందిన బుద్ధగయ లోని ప్రాంతంలో బౌద్ధ వ్యవహారాలను బీటీ యాక్ట్ 1949 ఏర్పాటు చేసుకొని బౌద్ధ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఉన్నారని అందులో నలుగురు బ్రాహ్మణులు నలుగురు బంతేలు ఒక కలెక్టర్ సభ్యులుగా ఉండి బౌద్ధ వ్యవహారాన్ని కొనసాగిస్తున్న ప్రాంతంలో ప్రస్తుతం బ్రాహ్మణులే బౌద్ధ వ్యవహారాలను కొనసాగించాలని ఒక కుట్రపూరితంగా బంతేజీలకు ఇబ్బందులను కలిగిస్తున్నారని అన్నారు. జాతీయ సమైక్యతలో భాగంగా ఎవరి మతాన్ని వారు నిర్వహించుకోవడానికి స్వేచ్ఛను కల్పించాలని నిరసన ధర్నాలు చేస్తున్న బౌద్ధ భిక్షువులకు సంఘీభావంగా ప్రగతిశీలవాదులు, ప్రజా సంఘాల వారు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. బుద్ధ గయను రక్షించాలని  వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లకు నివేధించనున్నట్లు తెలిపారు. 

    ధర్నాను ఉద్దేశించి ఆదివాసి ఉద్యమకారులు సోమ రామమూర్తి మాట్లాడుతూ లౌకిక భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ సమానత్వం ఉన్నప్పుడు, ప్రతి మతాన్ని గౌరవించినప్పుడే భారత రాజ్యాంగం వర్ధిల్లుతుందని అన్నారు.

  ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుట్ల రవీందర్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు డాక్టర్ నవీన్, బిఎల్ఎఫ్ నాయకులు ఇతం నగేష్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు