భక్తుల ఇంటి వద్దకే భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణ తలంబ్రాలు



 *భక్తుల ఇంటి వద్దకే భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణ తలంబ్రాలు*


 తెలంగాణ ఆర్టీసీ వరంగల్ టూ డిపో లాజిస్టిక్ ద్వారా భక్తుల ఇంటి వద్దకే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్టు

బుధవారం రోజున వరంగల్ -2 డిపో మేనేజర్

శ్రీమతి V. జ్యోత్స్న గారు తెలిపినారు.


భక్తులు తలంబ్రాల బుకింగ్ కొరకు ములుగు బస్టాండ్ కార్గో లాజిస్టిక్స్ ఆఫీస్ నందు మరియు బస్టాండ్ కంట్రోలర్ B. మోహన్ 

 90596 62555 గారి వద్ద నెంబరు బుక్ చేసుకుని 151/- యొక్క రూపాయలు చెల్లించి బుకింగ్ రసీదు తీసుకోగలరని తెలిపారు

 శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం ఇంటి వద్దకు కార్గో ఏజెంట్ ద్వారా తలంబ్రాలు పంపిణీ చేస్తామని తెలిపారు.



 భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణానికి వెళ్లలేని భక్తులు ఇట్టి సదా అవకాశాన్ని వినియోగించుకొని శ్రీరాముని ఆశీస్సులు పొందగలరని తెలిపినారు తలంబ్రాలు బుకింగ్ కొరకు ఈ క్రింది నెంబర్

B మోహన్

 90596 62555 గారిని

సంప్రదించగలరు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు