* అత్యంత వైభవంగా యాదగిరిగుట్ట ప్రధాన ఆలయం దివ్య విమాన స్వర్ణ గోపుర ప్రారంభం*
హైదరాబాద్, ఫిబ్రవరి 23...
* యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయం దివ్వ విమాన స్వర్ణ గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం 11 54 నిమిషాలకు ప్రారంభించారు. ఆగమశాస్త్ర ప్రకారం జరిగిన ఈ స్వర్ణ తాపడం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,ఎంపీలు, ఎమ్మెల్యేలు, మఠాధిపతులు, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కరరావు తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు .
ఈ రోజు ఉదయం11.54 గంటలకు మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రితో సహ పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ స్వర్ణ విమాన గోపురం దేశంలోనే ఎత్తైనది గా రికార్డు నెలకొంది...
50.5 అడుగుల ఎత్తు…10,759 చదరపు అడుగుల వైశాల్యం. 68 కిలోల బంగారం, 3.90 కోట్ల ఖర్చు..
ఉదయం 11.54 గంటలకు మూలా నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహుర్తాన శ్రీసుదర్శన లక్ష్మీనరసింహ స్వామివారికి గోపురాన్ని అంకితం చేశారు...
వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు..
..
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box