నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్,పోలీసుల దాడులు..
• రెండు మండలాల్లోని ఏడు గ్రామాల్లో ముకుమ్మడి దాడులు
• ఎనిమిది కేసుల్లో ఎనిమిది మందిపై కేసు నమోదు.
• 46 లీటర్ల నాటుసారాతో పాటు 150 కేజీల పంచదార, 4 కేజీల యేస్టు స్వాధీనం..
నాలుగు ఎక్సైజ్ టీమ్‌లు సివిల్ పోలీస్‌లు కలిసి సంయుక్తంగా సోమవారం ములుగు, వెంకటపురం మండలాల్లోని ఏడు గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు.
ములుగు మండలంలోని మల్లంపల్లి, జకారం, అబ్బాపూర్, శ్రీరాములపల్లి, వెంకటపురం మండలంలోని ఎంచన్‌చర్లపల్లి, మల్లయ్యపల్లి, నల్లగుంట గ్రామాల్లో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 46 లీటర్ల నాటుసారాను, 150 కేజీల పంచదారను, 4 కేజీల యేస్టు, 1300 లీటర్ల బెల్లం పానకం, మూడు మొబైయిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది కేసులు నమోదు చేసి ఎనిమిది మందిని తహశీల్దార్ ముందు బైండోవర్ చేశారు.
పట్టుకున్న సామాగ్రి విలువ రూ. 5 లక్షల మేర ఉంటుంద`ని అంచనా వేశారు.
ఈ దాడుల్లో హైద`రాబాద్ ఎస్ టి ఎఫ్ బి టీమ్ లీడర్ ప్రదీప్‌రావు, ఎస్సై బాలరాజు, ములుగు ఎక్సైజ్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సుధీర్ బృందం, డి టి ఎఫ్ భూపాల్‌పల్లి రాజసమ్మయ్య, లింగయ్య బృందం, ఎసీ ఎన్ ఫోర్స్‌మెంట్ సీఐ రజిత బృందం, వెంకటపురం పోలీస్ స్టేషన్ ఎస్సై బృందం నాటుసారా బ ట్టీలపై దాడులు నిర్వహించారు.
నాటు సారా బట్టిలపై దాడులు నిర్వహించడం పట్ల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలా సన్ రెడ్డి సిబ్బందిని అభినందించారు.
----
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box