**కిట్స్ వరంగల్ ఈసీఈ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్, శేషగిరిబాబు జిమ్మిడి కి డాక్టరేట్**
వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (కిట్స్‌డబ్ల్యూ)లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శేషగిరిబాబు జిమ్మిడి గారికి హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జె యన్ టి యు హెచ్) పీహెచ్‌డీ డిగ్రీని ప్రదానం చేసినది అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి సగర్వంగా తెలిపారు.
ఈరోజు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో, కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, శేషగిరిబాబు జిమ్మిడి తన సాంకేతిక పిహెచ్‌డి థీసిస్‌ను *“ఆర్టిఫాక్ట్ సప్రెషన్ ఆఫ్ ఈఈజీ సిగ్నల్స్ యూజింగ్ ఆర్మా ఫాస్ట్- ఐ సి ఎ”* పేరుతో జె యన్ టి యు హైదారాబాద్ పరీక్షల విభాగానికి సమర్పించారు. ఆయన హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఈ సి ఈ విభాగపు రిటైర్డు ప్రొఫెసర్ డా.కె వి ఎస్ వి ఆర్ ప్రసాద్ గారి పర్యవేక్షణలో ఆయన తన పరిశోధనను విజయ వంతంగా కొనసాగించారు అని తెలిపారు.
“మనిషి యొక్క మెదడు దాని స్థితి గతులను తెలుసుకునే ప్రక్రియలో వచ్చే అనవసర సిగ్నల్స్ ను తొలగించి మెదడు యొక్క ఖచ్చితమైన మరియు స్పష్టమైన స్థితిని నూతన పద్ధతులను ఉపయోగించి కనుక్కోవడమే ఈ పరిశోధనలో ముఖ్య అధ్యయనమ్ అని ప్రిన్సిపాల్ పేర్కోన్నారు. "అతను ప్రసిద్ధ జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలలో సాంకేతిక పరిశోధన పత్రాలను కూడా ప్రచురించారు అని సగర్వంగా తెలుపుతూ ముగించారు.
ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యం, ఫార్మర్ రాజ్య సభ ఎం.పి., కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి గారు అండ్ హుస్నాబాద్ ఫార్మర్ ఎమ్మెల్యే & కిట్స్ అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ గారు & ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి గారు బయోమెడికల్ సిగ్నల్ ప్రాసెసింగ్ లో అన్వయించ దగిన సమాజానికి అవసరమైన వినూత్న పరిశోధనలు చేసినందుకు శేషగిరిబాబు జిమ్మిడి గారిని శుభాకాక్షలతో అభినందించారు.
ఈ కార్యక్రమంలో కిట్స్ వరంగల్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, డీన్ అకడమిక్ అఫైర్స్, ప్రొఫెసర్ కె వేణుమాధవ్, అసోసియేట్ ప్రొఫెసర్ & ఈసిఈ విభాగపు హెడ్, డా. వి.వెంకటేశ్వర్ రెడ్డి, అందరూ డీన్లు, వివిధ విభాగాల హెడ్స్, అధ్యాపకులు, సిబ్బంది మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పి. ఆర్.ఓ. డాక్టర్ డి. ప్రభాకరా చారి, హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ ద్వారా పిహెచ్‌డి నీ పొందడం పట్ల శేషగిరి బాబు ను అభినందించి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచుకున్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box