ఎమ్మెల్సీ ఎన్నికల్లో బి.సి లను గెలిపించండి

 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో బి.సి లను గెలిపించండి

బి.సి ఎమ్మెల్సీల గెలుపు రాజ్యాధికారానికి తొలి మెట్టు

టీచర్ ఎమ్మెల్సీ లో సుందర్ రాజ్ యాదవ్, డాక్టర్ వెంకటస్వామి కి ఓట్లు వేయండి

ఎమ్మెల్సీ ఎన్నికలను బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక

ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్

బి.సి. సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్  గౌడ్


    ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బి.సి అభ్యర్థి సంఘం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ను బీసీలంతా ఏకమై భారీ మెజార్టీతో గెలిపించాలని, బి.సి లను గెలిపించడం ద్వారా రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ప్రారంభమవుతుందని, రాష్ట్ర రాజకీయాలను రేపటి భవిష్యత్ లో  బీసీలే శాసించనున్నారని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వండకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. ఆదివారం హన్మకొండ జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో పార్టీలకతీతంగా బీసీ అభ్యర్ధి సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా సంఘటితమై గెలిపిస్తే రాష్ట్ర రాజకీయాలలో ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేసి, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం సాధించడం ఖాయమన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 26 వేల ఓట్లు ఉంటే కేవలం 2000 ఓట్లు మాత్రమే ఆధిపత్య వర్గాల వారివి ఉన్నాయని, 24 వేల ఓట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఉన్నాయని, ఐదు శాతం కూడా లేని ఆధిపత్య వర్గానికి చెందిన వారు నలుగురు అభ్యర్థులు నిలబడితే 90 శాతం బహుజనులలో ఆరుగురు పోటీలో ఉన్నారని, దీంతో బహుజనుల ఓట్లు బి.సి లకు వేసుకుంటే విజయం సాధించుతారని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు. 



    ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ 77 ఏండ్ల స్వాతంత్ర భారతదేశంలో అన్ని రకాలుగా దోపిడీకి గురైన బి.సి సమాజం రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని అన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజక వర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సుందర్ రాజ్ యాదవ్ విద్యా వేత్తతో పాటు ప్రైవేట్ రంగంలో విద్యార్థుల బాధలు తెలిసినవాడని, ప్రభుత్వ విద్యను క్రమంగా నాశనం చేస్తున్న ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో చదువుతున్న విద్యార్థులకు చేయాల్సిన సహకారం చేయకుండా బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఎదగకుండా చేస్తుందని, కార్పొరేట్ విద్యా వ్యవస్థకు కొమ్ము కాస్తున్న పాలకులు చిన్న విద్యా సంస్థలను నాశనం చేస్తున్న క్రమంలో సుందర్ రాజ్ లాంటి నాయకున్ని శాసన మండలికి పంపాల్సిన అవసరముందని అన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన మరో అభ్యర్థి డాక్టర్ కొలిపాక  వెంకటస్వామికి బహుజనులు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. టీచర్ ఎమ్మెల్సీ అంటే ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులే అనే సాంప్రదాయాన్ని బద్దలు కొడుతూ కాకతీయ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రాజీనామా చేసి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న డాక్టర్ వెంకటస్వామి కంపెన్సటరీ పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ కు ప్రాతినిద్యం వహిస్తూ పోటీలో ఉన్నాడని, సుందర్ రాజ్ యాదవ్, డాక్టర్ వెంకటస్వామి లాంటి మేధావులను చట్టసభలకు పంపాల్సిన అవసరాన్ని బహుజనులు గుర్తించాలని అన్నారు.


    ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోనగాని యాదగిరి గౌడ్ మాట్లాడుతూ అగ్రకుల అభ్యర్థుల నోట్లను ఉపాధ్యాయ సమాజం తిరస్కరించి బీసీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని అన్నారు. బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర చట్టసభలలో 5 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, 17 మంది పార్లమెంట్ సభ్యులలో 10 ఎంపీలు ఉన్నారని, మళ్లీ తెలంగాణలో ఆధిపత్య వర్గానికి సంబంధించిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా బీసీలు తమకు తామే రాజకీయ సమాధి చేసుకుంటారనే విషయాన్ని బీసీలు గ్రహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జాతీయ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కోలా జనార్ధన్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీల రాజకీయ చైతన్యాన్ని, ఐక్యతను చూపెట్టి బీసీల శక్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.సి ఐక్య సంఘర్షణ సమితి జాతీయ కార్యదర్శి ఎదునూరి రాజమౌలి మాట్లాడుతూ బి.సిల గెలుపుతో రాష్ట్ర రాజకీయాల చిత్రపటమే మారిపోనుందని, బీసీల గెలుపు రాజకీయాలకు మలుపన్నారు. బీసీలు గెలువడం ద్వారా బీసీల ఆత్మగౌరవం పెరుగుతుందన్నారు. ప్రతి బి.సి బాధ్యత తీసుకొని అఖండ మెజార్టీతో బీసీ అభ్యర్థులను గెలిపించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల వాదాన్ని నిలబెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

     ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం  ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మేర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్ల సంపత్ కుమార్, బీసీ ఐక్య సంరక్షణ సమితి జాతీయ కార్యదర్శి ఎదునూరి రాజమౌళి, ముదురాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక  అధ్యక్షులు డాక్టర్ చందా మల్లయ్య, కుమ్మరి సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు కందికొండ వేణుగోపాల్, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనగాని శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్, బీసీ విద్యార్ధి సంఘం కేయూ ఇంచార్జి అరేగంటి నాగరాజు, బీసీ యువజన సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఏరుకొండ పవన్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు డాక్టర్ ఓడితల రాము, పంజాల మధు, పులి మోహన్, భీమన్న, గణేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు