ములుగు జిల్లా కేంద్రంలోని మీసేవ కేంద్రాల ఆకస్మిక తనిఖీ : DCSO సయ్యద్ షా పైసల్ హుస్సేన్
ఆహార భద్రత కార్డులో కొత్తగా కుటుంబ సభ్యుని నమోదుకు మరియు తొలగించడానికి మరియు కుటుంబ సభ్యుని పేరు, వయస్సు, చిరునామా, ఆధార్ నెంబర్ లను సవరణ చేసుకొనుటకు మీ సేవలో అవకాశం కలదు: ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్
నూతన రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ పరిశీలన
నిర్ణీత కుసుమ కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే కఠిన చర్యలు
*****
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల నమోదు ప్రక్రియలో భాగంగా ములుగు మరియు వెంకటాపూర్ మండలాలలోని పలు మీసేవ కేంద్రాలలో రేషన్ కార్డుల దరఖాస్తు నమోదు ప్రక్రియను జిల్లా పౌర సరఫరాల అధికారి సయ్యద్ షా పైసల్ హుస్సేన్ & ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, డిప్యూటీ తహసిల్దార్ నితీష్ మరియు డిస్టిక్ మేనేజర్ మీసేవ విజయ్ లు తనిఖీ చేశారు.
ఆహార భద్రత కార్డులో కొత్తగా కుటుంబ సభ్యుని నమోదుకు మరియు తొలగించడానికి మరియు కుటుంబ సభ్యుని పేరు, వయస్సు, చిరునామా, ఆధార్ నెంబర్ లను సవరణ చేసుకొనుటకు మీ సేవలో అవకాశం కలదు అని తెలిపారు.
ఈ సందర్భంగా ఆహార భద్రత కార్డు దరఖాస్తు సర్వీస్ గురించి మీసేవ కేంద్ర నిర్వాహకులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రజలు నిర్ణీత రుసుము చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు నమోదు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు మరియు తప్పులు లేకుండా అప్లికేషన్ నమోదు చేయాలని తెలిపారు.
గతంలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభ ద్వారా దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు మరల దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మళ్లీ దరఖాస్తు చేయాలని నిర్ణయం వారి ఇష్టం.
ప్రతి ఒక్క మీసేవ సెంటర్లో సిటిజన్ చార్టర్, మీసేవ ఫ్లెక్సీస్, ఇంటర్నెట్ , స్టేషనరీ తప్పకుండా ఉండాలని, దరఖాస్తు దారునితో దురుసుగా ప్రవర్తించవద్దని తెలిపారు. నిర్ణయించిన రుసుము కంటే ఎక్కువగా రుసుము తీసుకున్నట్లయితే అట్టి మీసేవ కేంద్రం పైన కఠిన చర్యలు తీసుకుంటామని మీసేవ కేంద్ర యజమానులను హెచ్చరించారు.
దరఖాస్తుదారునికి తప్పనిసరిగా మీసేవ రశీదు పత్రాన్ని ఇవ్వాలని సూచించారు.
*అలాగే లేబర్ కార్డు గురించి ముఖ్య సూచన:*
రాష్ట్రంలో నిర్మాణ కార్మికుల ప్రయోజనం కోసం తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ శాఖ ప్రవేశపెట్టిన లేబర్ కార్డు సర్వీసును అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
అనధికారిక లొకేషన్లలో మీసేవ లాగిన్ ఉపయోగించి లేబర్ కార్డు దరఖాస్తు చేసినట్లయితే అట్టి మీసేవ కేంద్రాన్ని మరియు లాగిన్ ఐడిని పూర్తిగా డి-ఆక్టివేషన్ చేయబడునని మీసేవ కేంద్ర యజమానులను ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ హెచ్చరించారు.
మరియు మీసేవ రసీదులో ఉన్న నిర్ణీత రుసుమును మాత్రమే తీసుకోవాలని ఎక్కువగా తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box