అనేక కష్టాలు అడుగడుగునా ఎవరోధాలు అయినా పోయిరావలె కుంభమేళా




*ఎన్ని కష్టాలైనా సరే కుంభమేళా, కాశీ, అయోధ్య లకు పోయి రావలే*
--------------------------------------
భక్తి, దైవ విశ్వాసం, చింతన అనేవి మానవున్ని ఎన్ని కష్టాలు వచ్చినా భరించేలా చేస్తాయి అనేదానికి నిదర్శనం ప్రయోగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళానే నిదర్శనం.  దాదాపు 40 రోజులపాటు పైగా కొనసాగుతున్న ఈ కుంభమేళాకు ప్రతిరోజు కనీసం కోటిన్నర మంది హాజరవుంటున్నారంటే  భారతదేశ ప్రజల్లో ఉన్న భక్తి భావం దైవ నీతికి, పటిష్టమైన సంస్కృతి కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మహా కుంభమేళా లాంటి మహా జాతర్లకు ప్రభుత్వం నుండి ఏ విధమైన ఏర్పాట్లను ఆశించకుండానే తమ విశ్వాసాన్ని ప్రకటించడానికిదేశ ప్రజలు వస్తారు అనేదానికి నిదర్శనం ఈ కుంభమేళా. 


కుంభమేళాకు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ వందలాది కిలోమీటర్ల దూరంలో నిలిచిన వేలాది వాహనాలు, మార్గమధ్యంలో భక్తులకు ఏ విధమైన కనీస సౌకర్యాలు లేమి, ఇతర రాష్ట్ర పోలీసులు, ప్రభుత్వ విభాగాలతో సమన్వయ లోపం తదితర కారణాలతో ప్రయోగరాజ్ తోపాటు సమీపంలోని కాశి, అయోధ్య వెళ్లేవారు ప్రత్యక్షంగా అనుభవించిన ఇబ్బందులు వారికి మోక్ష మార్గాన్ని పొందేలా తలపించాయి.


 ఇక 8.2.2025 న దాదాపు 300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉందంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. కాశీలోనైతే కనీసం ఒకరికి ఒకరు నడిచే పరిస్థితి కూడా లేదు. సరైన సమాచారం ఇచ్చే వ్యవస్థ లేదు.  పిల్లలు వికలాంగులకు ఏ విధమైన కనీస ఏర్పాట్లు కూడా కాశీలో లేవు. ఇన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఏఒక్కరు గానీ తిరిగి ఇంటికి పోదామని అనకుండా చివరి క్షేత్రమైన అయోధ్యకు వెల్దామని అనడం మనవారి పటిష్టమైన భారతీయ సంస్కృతి, తత్వం మరోసారి ఆవిస్కృతమైంది. 


   దక్షిణాది, ఉత్తరాది,  ఈశాన్యం పశ్చిమ రాష్ట్రాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు తమకు అందుబాటులో ఉన్న వాహనాలు ముఖ్యంగా కార్లు బస్సులు టెంపోలలో పిల్లలతోసహా లక్షలాదిగా తరలి రావడం వందల కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ లు ఏర్పడడం మార్గమధ్యంలో సరైన పార్కింగ్ వసతి కల్పించకపోవడం,  కనీసం లక్షల మంది ప్రయాణించే ప్రధాన జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులలో టాయిలెట్, నీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. 140 ఏళ్లకు ఒకసారి కుంభమేళా వస్తుందని ఊదరగొట్టిన ప్రచారం జిల్లా పాపలతోపాటు పండ్లు ముదుసలీలను కుంభమేళాకు వచ్చేలా ప్రేరేపించాయి. ప్రయోగ రాజ్ కుంభమేళాలో పుణ్య స్థానాలు చేస్తే మోక్షం లభిస్తుందనే విశ్వాసం అనేవి పక్కకు పెడితే ఇక్కడ ముఖ్యంగా ప్రయోగ రాజ్, కాశీ, అయోధ్యలో చేసిన ఏర్పాట్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణా లో జరిగే అతి పెద్ద గిరిజన సమ్మక్క, సారలమ్మ జాతరలో రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏర్పాట్లు వంద రేట్లు అద్భుతంగా ఉంటాయి. అసలు, మన మేడారం జాతర ఒక కేస్ స్టడీగా చేపట్టి కుంభ మేళా వంటి మెగా ఈవెంట్ల నిర్వాహకులు అధ్యయనం చేస్తే ఇక్కడికి వచ్చే లక్షలాది మందికి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

కన్నెగంటి వెంకట రమణ 
జాయింట్  డైరెక్టర్ ఐ అండ్ పి ఆర్
తెలంగాణ 
--------------------------------------
      తేదీ. 13.2.2025. (అయోధ్య)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు