*కిట్స్ వరంగల్ క్యాంపస్ లో "సంస్కృతి'25" ట్రైలర్ మరియు వెబ్‌సైట్ ఆవిష్కరణ*
*విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి ఆనందోత్సాహలు నింపడమే కల్చరల్ ఫెస్ట్ ముఖ్య ఉద్దేశ్యమని రాజ్యసభ మాజీ సభ్యులు కిట్స్‌డబ్ల్యూ చైర్మన్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు అన్నారు.*
మ్యూజిక్ డ్యాన్స్ & ఫైన్ ఆర్ట్స్ (యం డి యఫ్) క్లబ్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు)వారు "సంస్కృతి '25" అనే పేరుతో జాతీయ స్థాయి సాంస్కృతిక కార్నివాల్‌ను 2025 ఫిబ్రవరి 7-8 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించ నున్నారని కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు.
సంస్కృతి '25" ట్రైలర్ వెబ్‌సైట్‌ను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి, డీన్ విద్యార్థి వ్యవహారాల ప్రొఫెసర్ ఎం. శ్రీలత, అసోసియేట్ డీన్ స్టూడెంట్స్ అఫైర్స్, ఎం. నరసింహారావు, పి అర్ ఓ & కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ డి. ప్రభాకరా చారి మరియు విద్యార్థి ప్రతినిధులతో కలిసి కిట్స్ వరంగల్ క్యాంపస్‌లోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో విద్యార్ధుల హర్ష ధ్వానాల మధ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ, నిర్వహణా నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు వినోదం, ఆనందం కల్చరల్ ఫెస్ట్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రెండు రోజుల సంస్కృతీ ఈవెంట్‌లో, మొదటి రోజు పాశ్చాత్య రోజు ప్రారంభోత్సవ వేడుక, రెండవ రోజు సాంప్రదాయ బీట్‌లు మరియు లైవ్ బ్యాండ్ షోలు ఉంటాయి. ఇందులో ప్రముఖ గాయకులు ఉంటారు. రంగులు, సంగీతం, నృత్యం మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంతో ఆనందించి విజయవంతం చేయాలని, అభిరుచి అనేది సానుకూల భావోద్వేగమని, అందుకే మీ లక్ష్యాన్ని సాధించడానికి నిజమైన స్ఫూర్తి ధ్యేయంగా సవాళ్లను ఎదుర్కోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డీన్ విద్యార్థి వ్యవహారాలు, ప్రొఫెసర్ ఎం. శ్రీలత మాట్లాడుతూ ఇంకా అదనంగా ఫుడ్ స్టాల్స్, లైవ్ పెయింటింగ్, ఫేస్ పెయింటింగ్, పాట్ మేకింగ్ మొదలైన 10 కంటే ఎక్కువ స్పాట్ ఈవెంట్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువలోక మనసులు తేలిక పరచడానికి వినోదం, ఉత్సాహం మరియు అభిరుచితో అనుసంధానం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, కిట్స్ వరంగల్ కోశాధికారి పి.నారాయణరెడ్డి మరియు హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే & కిట్స్‌డబ్ల్యు అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థిని విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ ట్రైలర్ మరియు వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో చీఫ్ ప్యాట్రన్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి, డీన్ విద్యార్థి వ్యవహారాలు, ప్రొఫెసర్ ఎం. శ్రీలత, అసోసియేట్ డీన్ విద్యార్థి వ్యవహారాలు & ఈ ఈ ఈ అసోసియేట్ ప్రొఫెసర్, యం. నర్సింహారావు, కిట్స్‌డబ్ల్యు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి. , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొఫెసర్. పి. రమేష్ రెడ్డి, వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల విభాగాధిపతులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ & ఫి అర్ ఓ , డాక్టర్ డి. ప్రభాకరా చారి, యమ్ డి యఫ్ క్లబ్ ప్రధాన కార్యదర్శులు హెచ్, శ్రీగౌరీ జాహ్నవి మరియు యం సాకేత్, పబ్లిక్ రిలేషన్స్ , పి రక్షిత్, వివిధ క్లబ్‌ల ప్రధాన కార్యదర్శులు & సంస్కృతి'25 విద్యార్థి ప్రతినిధులు, కిరిల్ ప్రవర్ష్, ఆసిఫ్ అబూబకర్, నయన, మరియం యాస్మీన్, సుఫియాన్, వనలక్ష్మి, అనిరుధ్ , రియాన్, శశి, రాహుల్, రిషిత్, స్నేహ, స్నేహాంకిత, పాటు డిస్కో క్లబ్, పి ఎం సి, సాక్ సభ్యులు, విద్యార్ది ప్రతినిధులు, అధ్యాపక సభ్యులు మరియు 150 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box