*బస్టాండ్‌లో చోరీలకు పాల్పడుతున్న కిలాడీ దంపతుల అరెస్ట్*
*రద్దీగా వున్న సమయాల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకోని మహిళల మెడల్లో బంగారు అభరణాలు చోరీలకు పాల్పడుతున్న భార్యభర్తలను హనుమకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. ఈ దంపతులను నుండి సుమారు ఏడు లక్షల యాబై వేల రూపాయల విలువగల 80.5 గ్రాముల బంగారు అభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.*
ఈ అరెస్టుకు సంబందించి హనుమకొండ ఏసిపి దేవేందర్ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట మండల కేంద్రంలోని వడ్డెర కాలనీని చెందిన భార్య భర్తలు బొంత జ్యోతి (30), బొంత కిషన్ (37) ఇరువురు రోజు వారి కూలీలుగా పనిచేసేవారు. దీని వలన వారికి వచ్చే అదాయం వారి ఇంటి ఖర్చులకు సరిపోకపోవడంతో పాటు, కొద్ది కాలంగా ఇరువురికి ఆరోగ్య సమస్యలు ఎదురౌవ్వడంతో ఖర్చుల నిమిత్తం పరియచస్తుల వద్ద డబ్బును అప్పుగా తీసుకోవడం జరిగింది. తీసుకున్న అప్పును చెల్లించేందుకు వారికి వచ్చే అదాయం సరిపోకపవడంతో అప్పు ఇచ్చిన వారి నుండి ఒత్తిళ్ళు రావడం ఈ ఘరానా దంపతులు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం ఈ కిలాడీ జంట రద్దీగా వుంటే ఫ్లాట్‌ఫారంపై వున్న బస్సు ఎక్కె ఒంటరి మహిళా ప్రయాణికులే లక్ష్యంగా చేసుకోని చోరీ చేసేందుకు ఈ దంపతులు సిద్దపడ్డారు. చోరీలో భాగంగా ఈ ఘరానా దంపతులు పథకం ప్రకారం భర్త ముందుగా రద్దీగా ప్రయాణీకులు ఎక్కే ద్వారంలో ఎవరు ఎక్కకుండా బస్సు లొపలికి వెళ్ళేందుకు ఇబ్బంది పడుతున్నట్లుగా ద్వారంలో నిలబడి వుందే సమయంలో నిందితురాలు అయిన భార్య మహిళ మహిళల మెడల్లోని బంగారు అభరణాలు చోరీ చేసి అక్కడి తప్పించుకుని పారిపోయేవారు. ఇదే రీతిలో ఈ దంపతులు ప్రస్తుత ఫిబ్రవరి మాసంలో హనుమకొండ బస్టాండ్‌లో మూడు చోరీలకు పాల్పడి బంగారు అభరణాలు చోరీకి పాల్పడ్డారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను వారి ఇంటిలో భద్రపరిచేవారు.
ఈ చోరీలపై ఫిర్యాదులు నమోదు చేసుకున్న హన్మకొండ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు టీంను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితులను గుర్తించడం జరిగింది. ఈ రోజు ఉదయం ఈ కిలాడీ దంపతులు చోరీ సోత్తును హనుకొండలోని ఎదైనా బంగారు దుకాణంలో అమ్మేందుకు చౌరస్తాకు రావడంతో అక్కడే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఈ దంపతులపై అనుమానంతో వారి వద్ద వున్న బ్యాగ్‌ను తనీఖీ చేయగా అందులో బంగారు అభరణాలు గుర్తించిన పోలీసులు వారి అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు పాల్పడిన చోరీలను అంగీకరించారు.
ఈ నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కబరిచిన హనుమకొండ ఇన్స్‌స్పెక్టర్ సతీష్, ఆడ్మిన్ ఎస్.ఐ అశోక్, డిటెక్టివ్ ఎస్.ఐ కిషోర్, హెడ్‌కానిస్టేబుళ్ళు రవూఫ్, నారాయణ, కానిస్టేబుళ్ళు మహేష్,వీరన్న, ఆశోక్, భాస్కర్, మహిపాల్‌ను ఏసిపి అభినందించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box