బలమైన బి.సి గొంతులకు మద్దతుగా నిలవాలి

 


బలమైన బి.సి గొంతులకు మద్దతుగా నిలవాలి

రాజ్యాధికారంతోనే దుర్మార్గ చట్టాలను అడ్డుకోవాలి

సైకిల్ యాత్ర విరామ సభలో పలువురు బి.సి నాయకులు


      బి.సి ల విముక్తి కోసం త్యాగాలు చేసే బలమైన గొంతులకు బి.సి సమాజం అండగా నిలవాలని, సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యమని బి.సి రైటర్స్ వింగ్ చైర్మన్ చింతం ప్రవీణ్ కుమార్, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్ల సాధనతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ అమలు డిమాండ్ చేస్తూ గత 14 రోజులుగా కొనసాగుతున్న బి.సి ఆజాధి సైకిల్ యాత్ర విరామ సభకు వారు హాజరై మాట్లాడారు. జనవరి 19 న జనగామ జిల్లా ఖిలాశపూర్ లో ప్రారంభమైన బి.సి సైకిల్ యాత్ర శనివారం వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ కోటలో విరామం ప్రకటించారు.   

    సైకిల్ యాత్రకు నాయకత్వం వహిస్తున్న బి.సి ఉద్యమకారులు బత్తుల సిద్దేశ్వర్లు, చాపర్తి కుమార్ లు మాట్లాడుతూ బృందం చట్టసభల్లో బి.సి రిజర్వేషన్ల కోసం గత పార్లమెంటు ఎన్నికల ముందు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఖిలాశాపూర్ లో విరామం ప్రకటించామని, అక్కడ నుండి ప్రారంభమైన సైకిల్ యాత్ర చారిత్రక ఖిలా వరంగల్ కోటలో విరామం ప్రకటించామని అన్నారు. గతంలో స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కోసం ఆమరణ నిరహార దీక్ష చేసామని, బి.సి. ఉద్యమానికి ఊపిరిలాగ నిలుస్తున్న బలమైన గొంతులకు బి.సి లు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత వుందని అన్నారు. ఒకనాడు బహుజన రాజ్యం కోసం కాన్షీరాం, మారోజు వీరన్నలు బలమైన గొంతులుగా ఉన్నారని, ప్రస్తుతం  తెలంగాణలో బి.సి ల తరుపున బలమైన గొంతుగా ముందుకు వస్తున్న తీన్మార్ మల్లన్నకు బి.సి సమాజం అండగా నిలవాలని అన్నారు. ఇడబ్లూఎస్ రిజర్వేషన్ల వల్ల బహుజన సమాజానికి తీరని అన్యాయం జరుగుతుందని, ఇ డబ్లూ ఎస్ రిజర్వేషన్లను తీసుకొచ్చిన బిజెపి ప్రభుత్వాన్ని, అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం స్థానిక సంస్థల్లో బి.సి లు ఎక్కువ సీట్లు గెలిచేందుకు హనుమకొండ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 2 న జరుగు బి.సి రాజకీయ యుద్ధ బేరిలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. 



    సైకిల్ యాత్రలో పాల్గొన్న పర్వత సతీష్, కొంగర నరహరి, కె విజయ్ కుమార్, బత్తుల రాంనర్సయ్య, చింతలగారి వెంకటస్వామి, గుంటుక నవ్య, కోట్ల వాసుదేవ్, పిట్టల వెంకటేష్, గునిగంటి విష్ణువర్ధన్, కౌటం రవికుమార్, తదండ్ల రంజిత్, బరుబట్ల రవి, కొయ్యాడ రాజేష్, చెరుపల్లి సునీల్, తొడేటి సుధాకర్, సన్నగల్ల జహంగీర్ లకు మెమొంటోలు ఇచ్చి, శాలువాలతో సత్కరించారు.


    ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా బి.సి జాక్ చైర్మన్ సూరం రవీందర్, బి.సి ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ కొంగ వీరాస్వామి, గీసుగొండ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమగాని సౌజన్య, బి.సి ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏదునూరి రాజమౌలి, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, తీన్మార్ మల్లన్న టీం నాయకులు మాధం నరేష్, బి.సి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బుసిగొండ ఓంకార్,  వివిధ సంఘాల నాయకులు చిలువేరు రాంచందర్, సూరం నిరంజన్, సింగారపు అరుణ, డాక్టర్ కొనతం కృష్ణ, పెండల సంపత్, జంగిలి శ్రీనివాస్, పరుషరాములు, అవ్వారు వేణు, రాజ్ కుమార్, తుమ్మ తిరుపతి, సాగర్ల శ్రీనివాస్, పుప్పాల రాజు, బొలుగొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు