లాస్ వేగాస్ ప్రయాణం - నా పరిశీలన




My journey to Las Vegas

 లాస్ వేగాస్ - ప్రపంచంలోని జూద గృహాలకు రాజధాని

చికాగో నుండి నాలుగు గంటల ప్రయాణం తర్వాత లాస్ వేగాస్ చేరుకున్నాం. విమానాశ్రయం నుండి  లాస్ వేగాస్ లోని మా వసతి గృహానికి చేరుకునేసరికి రాత్రి 9 గంటలు అయ్యింది.  దారి పొడవునా లాస్ వేగాస్ లోని ఎత్తైన భవన వసతి గృహాలు, కాసినోలు నిరంతరంగా దేదీప్యమానంగా వెలుగుతున్న విద్యుత్ దీపాల వెలుతురులో రాత్రి అయిన పగలనని భ్రమ కలిగించాయి.


          ఒక భవనానికి ఇంకో భవనానికి నిర్మాణ సరళిలో ఏమాత్రం పోలిక లేకపోవడం, ఆ భవనాల దీపాలంకరణల వెలుతురు ప్రతిబింబాలు నీళ్లల్లో కనిపించి మా ప్రయాణ అలసటను పూర్తిగా మరిచిపోయి మేము ఆ నగర సౌందర్యానికి మైమరిచిపోయాం.
          కాసినోళ్ల లోను,  రహదారుల్లోనూ గుంపులు, గుంపులుగా సంచరిస్తున్న యువతి యువకుల వినూత్న వేషధారణ చూసి మేము ఆశ్చర్యపోయాం. ముఖ్యంగా కాసినోలో  పనిచేసే యువతుల వేషధారణ దుస్తులు పారదర్శకంగా ఉండి కొంత గమ్మత్తుగా కొంత ఇబ్బందిగా ఫీలయ్యాం.
 మా వసతి గృహానికి వెళ్లి కొంచెం సేద తీరిన తరువాత డిన్నర్ చేయడానికోసం బయటకు వచ్చాం. రాత్రి 12 గంటలు  అవుతున్న వీధులన్నీ రద్దీగానే ఉన్నాయి. హోటళ్లలో విశాలమైన కాసినోలో ఎక్కడ చూసినా వెలుగు జిలుగుల విద్యుత్ దీప కాంతితో కాసినోలో సందర్శకులు పూర్తిగా జూదంలో నిమగ్నమై ఉన్నారు. కాసినోల్లోనే టేబుల్ పైన డ్రింక్స్ మరియు స్నాక్స్ సర్వ్ చేస్తున్నారు.


          మా వసతి గృహానికి కొద్ది దూరంలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ కి డిన్నర్ కోసం బయలుదేరాం క్యాబ్లో దారికి ఇరువైపులా మిల మిలా మెరుస్తున్న విద్యుత్ దీపాలతో, వివిధ థీమ్లతో నిర్మించిన ఎత్తైన భవనాలను చూస్తుంటే నగరమంతా పండగ వాతావరణం నెలకొని ఉంది. నగర విశేషాలు పరిశీలిస్తే 1905 పూర్వం వరకు పూర్తిగా ఇదంతా ఎడారి.  ఈ నగరానికి కొన్ని మైళ్ళ దూరంలో అణు పరీక్షలు నిర్వహించడం వల్ల లాస్ వేగాస్ ని ఆటామిక్ సిటీ గా కూడ పిలుస్తారు.                                                                                                                                                                                                                                                                   
 
2
1905 సంవత్సరం తర్వాత ఇక్కడ భవన నిర్మాణాలు ప్రారంభమై అతితక్కువ కాలంలోనే ఈ నగరం ప్రపంచంలోనే గ్యాబ్లింగ్ క్యాపిటల్ గా పేరుగాంచింది. కేవలం 110 ఎకరాల్లో నిర్మించబడ్డ ఈ నగరం 30 కి పైగా అతి ఎత్తైన విలాసవంతమైన ఆకాశ హర్మ్యాలు కలిగి ఉండి ప్రతి హోటల్లోనూ ఒక విశాలవంతమైన కాసినో బార్ మరియు రెస్టారెంట్ కలిగి ఉండి ప్రపంచ వింతలు అయిన ఈజిప్టు పిరమిడ్స్, పారిస్ లోని ఐఫిల్ టవర్, ఇటలీ లోని రోమ్ కోలోషియం మరియు ప్రఖ్యాత విహార కేంద్రాలుగా ఖ్యాతి చెందిన లండన్ పే న్యూయార్ లోని స్ట్రాచు ఆఫ్ లిబర్టీ ఎంపైర్ బిల్డింగ్ భవన నమూనా పోలిన అతి ఎతైన భవంతులు ఇక్కడ నిర్మించబడి ఉన్నాయి. ఈ ప్రాంతం చూశాకే ఉత్సాహంతో ఆ మరుసటి సంవత్సరం యూరప్ దేశాలు పర్యటించి ప్రపంచ వింతలు ఐన రోమ్ కోలోషియం, పారిస్ లోని ఐఫిల్ టవర్, లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ప్రాంతాలను చూడటానికి వెళ్లడం జరిగింది.        
 లాస్ వేగాస్ పర్యాటక అభివృద్ధి అతి తక్కువ సమయంలో జరగడం వల్ల ఇక్కడ జూద గృహాలు నేరస్తులకు కేంద్రంగా మారి,  నేరస్తుల ముఠా నాయకులచే జూద గృహాలు నిర్వహించబడటం చేత దీన్ని సిన్ సిటీ అని కూడా పిలుస్తుంటారు.


          ఇక్కడ రోజుకు సరాసరి 200 నుండి 300 వివాహాలు  జరగడం వల్ల కూడ ఈ నగరం మ్యారేజ్ కాపిటల్ గా కూడ ప్రసిద్ధి చెందింది. అలాగే ఎక్కువ విడాకులు జరిగే ప్రాంతంగా కూడ  గుర్తింపు తెచ్చుకుంది. దీనికి కారణం ఇక్కడి చట్టాల్లో విడాకులకు అనువైన నిబంధనలు. అతి కొద్ది సమయంలో అంటే కేవలం 10 నిమిషాల్లోనే వివాహ తంతు ముగిసిపోతుంది. ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రేమికులు ఈ నగరంలో వివాహం చేసుకోవడానికి ప్రాముఖ్యతను ఇస్తారు.  అన్ని వివాహ తంతుల్లో ఉపయోగించే వివిధ సాంప్రదాయ దుస్తులు కొనుగోలు చేయడానికి షాప్ లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొన్ని ప్రదేశాలు విహంగ విక్షణంలా దర్శించి మరుసటి రోజు వెళ్ళలిసిన ప్రదేశాలు నోట్ చేసుకుని రూమ్ కి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాం.
          ఆ మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ ముగించి ముందుగా సీజర్ ప్యాలెస్ థీమ్ కల కాసినో కం హోటల్ కి వెళ్ళాం.  ఇది పూర్తిగా ఇటలీలోని నిర్మించబడిన ప్రపంచ వింతల్లో ఒకటైన రోమ్ కోలోషియం పోలికలతో ఉన్న నిర్మాణాన్ని ఇక్కడ నిర్మించారు.  దీనితో పాటు వెనిస్ లోని నీటితో ప్రవహించే కాలువలు,  అందులో యాత్రికులను వ్యాహ్యళికై తీసుకెళ్లే గండోళలు (పడవలు)  పైన ఆకాశాన్ని పోలిన కప్పు (ఇది కూడా యాంత్రికంగా నిర్మించబడింది).  
3
కాలువల కిరువైపులా హోటళ్లు, షాపింగ్ సెంటర్లు, గిఫ్ట్ సెంటర్లు, బట్టల షాపులు ఒక్కటేమిటి ఆ ప్రాంతంలో దొరికే ప్రతి  ఐటమ్ ఈ ప్రాంతంలో దొరికే లాగా నిర్మించారు. ఈ గండోలాల్లో మేం కూడా విహరించి ఇక్కడ కొంత సమయం గడిపి తర్వాత మరో థీమ్ పార్కు ఐన ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ ని పోలిన ఐఫిల్ టవర్ ని హోటల్ చూడ్డానికి వెళ్ళాం.
 ఐఫిల్ టవర్ థీమ్ పార్క్ హోటల్ కూడా ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ పోలిన నిర్మాణం లాగానే ఉంది.   కొంచెం సేపు ఇక్కడ కాసినో లో ఆటలను గమనించి అక్కడి నుండి సమీపంలోని ఒక ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేశాం.


బెలీజియం వాటర్ ఫౌంటెన్ షో మూడు గంటలకు స్టార్ట్ అవుతుందని తెలుసుకొని ఆ సమయానికి అక్కడికి చేరుకున్నాం.  ప్రతి గంటకు 15 నిమిషాలు చొప్పున ఈ వాటర్ ఫౌంటెన్ మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఆపరేట్ చేస్తారు.  దాదాపు 20 నుండి 30 అడుగుల పైగా ఎత్తుకు నీటిని చిమ్ముతూ వయ్యారంగా ఫౌంటెన్ నీళ్లు ముందుకు వెనుకకు నలువైపులా తిరుగుతూ నాట్యం చేస్తున్నట్లుగా ఉండి ఈ ప్రాంతానికే ఆకర్షణగా ఉన్న ఈ వాటర్ ఫౌంటెన్ మాకు చాలా బాగా నచ్చింది.
          ఎక్కువ మంది సందర్శకులు ఈ ఫౌంటెన్ చూడడానికి వచ్చారు. ఈ ఫౌంటెన్ పగలు కంటే రాత్రిపూట విద్యుత్ దీపాల కాంతుల్లో ఇంకా ఆకర్షణీయంగా ఉంటుందని తెలుసుకొని ఇతర ప్రాంతాలు చూడ్డానికి బయలుదేరాం. ఎం.జి .ఎం హోటల్ కం కాసినో లో 4800 గదులు ఉన్నాయ్ అని తెలుసుకుని అవాక్కైయ్యామ్. ఇక్కడ రష్ ని బట్టి హోటల్ రెంట్స్ మారుతూ ఉంటాయి. ఈజిప్ట్ లోని పిరమిడ్ నమూనా కాసినో, లండన్ లోని లండన్ ఐ పోలిన కాసినో,  న్యూయార్క్ లోని ఎంపైర్ బిల్డింగ్లను పోలిన కాసినో, వాటికి సంబందించిన వసతి గృహాల ఎతైన ఆకాశ  హర్మాలను చూసాం. ఒక్కో కాసినో ఒక్కో విధంగా అందంగా అలంకరించబడి ఉంది.  కొన్ని అలంకరణలు పూర్తిగా అందమైన పూలతో అలంకరించబడితే మరికొన్ని వివిధ ఆకృతుల్లో ఉండి  ఆకర్షణీయమైన పరికరాలతో, షాండిలియర్ లతో, రంగురంగుల లైట్స్ తో అలంకరించబడి ఉన్నాయి.  చీకటి పడగానే అక్కడ ఉన్న అన్ని భవనాలు విద్యుద్దీపకాంతులతో మెరిసిపోతూ ఎంతో అందంగా ఉన్నాయి. గ్లోబ్ ఆకారంలో ఉన్న కాసినో హోటల్ ప్రాంతం చూపర్లను ఇట్టే ఆకర్షించింది.  మేం కూడా  దాని చూడ్డానికి వెళ్ళాం.  ఎల్. ఈ. డి  
4
బల్బులతో నిండి ఉండి గడియ గడియకు రంగులు మారుతూ గ్లోబ్ ఆకృతులు మార్పు చెందేలా నిర్మించబడి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఎన్ని గంటలు చూసినా తనివి తీరనంతగా ఆకర్షించబడుతున్న  ఆ  ప్రాంతంలో చాలాసేపు గడిపాం. రాత్రి 12 గంటల సమయంలో పూర్తిగా అలసిపోవడంతో రూమ్ కి వెళ్లి పోయాం.
 ఆ మరుసటి రోజు ఉదయం నెవడా జంతుప్రదర్శనశాల మరియు బొటానికల్ పార్క్ చూడడానికి వెళ్ళాం. ఇది లాస్ వేగాస్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.  ఇందులో దాదాపు 150 రకాల జంతువులు ఉన్నాయి. దీన్ని సైరా సఫారీ జంతుశాలగా పిలుస్తారు.  దీన్ని జూలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
          పర్యావరణంలో జంతువుల ప్రాముఖ్యత గురించి వివరిస్తూ మానవులకు, జంతువులకు మధ్య గల అవినాభావ పర్యారణ అనుబంధం తెలియ చెప్పటంలో ఈ జూలాజికల్ సొసైటీ ఎంతో ప్రాముఖ్యత వహిస్తున్నది. చాలావరకు అంతరించిపోతున్న జంతుజాలంపై దృష్టి కేంద్రీకరించి వాటిని పరిరక్షిస్తున్నారు.  ఔత్సాహికులైన ముగ్గురు స్వచ్ఛంద కార్యకర్తలు ఈ సంస్థను స్థాపించి దీన్నే ప్రవృత్తిగా  పెట్టుకొని ఈ ప్రాంతంలో కొంత భూమిని 1989 లో కొనుగోలు చేసి 1990లో దీన్ని స్థాపించారు. ఇందులో పని చేసే వాళ్లంతా జంతు ప్రేమికులే కాకుండా స్వచ్ఛంద కార్యకర్తలు కూడా.  ఆ ప్రదేశంలోని జంతువులకు మేము ఆహారం కొనుగోలు చేసి వాటికి తినిపించాం.  ఒక్కో జంతువును ఒక్కో ఏంక్లోజర్ లో ఉంచారు. ఇతర జంతుప్రదర్శనశాలల్లోని జంతువుల కంటే ఇక్కడి  జంతువులన్నీ ఎంతో చురుగ్గా, ఆరోగ్యకరంగా కనిపించాయి.  ఈ సంస్థ చేస్తున్న కృషిని అభినందించి మేము కూడా కొంత రుసుము దానికి విరాళంగా ఇచ్చి సాయంత్రం వరకు ఈ జంతు ప్రదర్శనశాలలో గడిపి తిరిగి లాస్ వేగాస్ కు చేరుకున్నాం.
          సాయంత్రం ఏడు గంటలకు లాస్ వేగాస్ లోని డౌన్ టౌన్ ప్రాంతానికి వెళ్ళాం. ఈ ప్రాంతమంతా ఇరుకు గా ఉన్న రోడ్ల అయినప్పటికీ పూర్తిగా విద్యుత్ దీపాలతో అలంకరింపబడి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడటం చూసాం.  ఆ ప్రాంతంలోని వివిధ వినోద కార్యక్రమాలు కూడ వీక్షించి రాత్రి వరకు అదే ప్రాంతంలో గడిపి మా వసతి గృహానికి చేరుకున్నాం.


 
5
ఆ మరుసటి రోజు ఉదయం లాస్ వేగాస్ నుండి ఒక గంట ప్రయాణించి హూవర్ డ్యాం చేరుకున్నాం.  ఎంతో ఎత్తయిన కాంక్రీట్ డ్యాం  నిర్మాణం సందర్శకులకు కనువిందు చేస్తుంది.  రెండు కొండల మధ్య నిర్మించిన ఈ భారీ కాంక్రీట్ కట్టడాన్ని చూసి 1930 ప్రాంతంలో సాంకేతిక అభివృద్ధి తక్కువగా ఉన్న ఆ రోజుల్లో ప్రతికూల పరిస్థితుల్లో దీన్ని నిర్మించిన ఇంజనీర్లు మరియు శ్రామికులకు మనసులోనే అభినందనలు తెలిపాం.  హూవర్ డ్యాం  నిర్మాణ విషయంలోని వివరాలు పరిశీలిస్తే 1900ల సంవత్సరంలో గ్రాండ్ కెన్యాన్ ప్రాంతంలోని బ్లాక్ కెన్యాన్ మరియు బౌల్డర్ కెన్యాన్ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి కొలరాడో నది ప్రవాహానికి  అడ్డుకట్ట వేసి  నీటిని నిల్వ చేసి వీటి  ద్వారా విద్యుత్ ఉత్పత్తిని తయారుచేసే ఉద్దేశంతో సర్వే జరపడం జరిగింది. ఇంత పెద్ద కాంక్రీట్ నిర్మాణాలు అప్పటి వరకు లేకపోవడం మూలాన మరియు ఈ ప్రాంతం అంతా కొన్ని మాసాలు అతి శీతలంగాను మరికొన్ని మాసాలు అతి  ఊష్ణంగాను ఉండటం, సాంకేతిక నిపుణులు, శ్రామికులు సరిపోను లేకపోవడం కూడా ఈ డ్యాం నిర్మాణం ఆలస్యం కావడానికి కారణాలుగా చెప్తారు.


          కొలరాడో నది పైన 1931లో ప్రముఖమైన హూవర్ డ్యాం నిర్మాణం వివిధ కారణాలవల్ల ఆలస్యంగా ప్రారంభమై 1936లో పూర్తయింది 1947  సంవత్సరంలో దీన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు హెర్బర్ట్ హూవర్ పేరు మీదుగా హూవర్ డ్యాం గా నామకరణం చేశారు. ఈ డ్యాం ద్వారా ఉత్పత్తి ఐన విద్యుత్తు నెవడా, అరిజోనా మరియు కాలిఫోర్నియా రాష్ట్రాల అవసరాలను తీరుస్తున్నది.
 1936లో ఈ డ్యాం పూర్తయినప్పటికీ 1936 నుండి 1947 వరకు దీన్ని బౌల్డర్ డ్యాం గా వ్యవహరించారు.
          విజ్ఞానంతో వినోదం అందించిన లాస్ వేగాస్ను నిర్మించిన, సమర్థవంతంగా నడుపుతున్న అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు మనసులో తెలుపుకుంటూ  అక్కడి నుండి నిష్క్రమించాం.
 
 
రంగరాజు శ్యాంసుందర్ రావు
7780698038

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు