“ నాకీ మొగుడొద్దు” #@$% “అలాగేనమ్మా”
మా పీజీలో షేక్ స్పియర్ నాటకం “కింగ్ లియర్” చదివాం.
లియర్ రాజుగారికి ఓరోజు (విపరీత) బుధ్ది పుడుతుంది. తన రాజ్యాన్ని పంపకంచేసేముందు ముగ్గురు కుమార్తెల్లో తననెవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవలనిపించింది. రాజుకదా! బ్యాక్‌డోర్, సైడ్‌డోర్ పధ్ధతులుకాకుండా స్ట్రెయిట్ మెధడ్ అనుసరించాడు.
మరురోజు నిండు సభలో ముగ్గురు కూతుళ్ళను పిలిచి “నన్ను ఎక్కువగా ప్రేమించేవారికే నేను రాజ్యాన్నిస్తాను, చెప్పండి. నన్నెవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారో?”
విదూషకుడు; (తనలో తాను) నాకు తోడుగా మరో విదూషకుడు రాబోతున్నాడు. నేను నవ్విస్తాను. ఆయన ఏడుస్తాడు.
పెద్దకూతురు: ‘నాన్నా! నీతరవాతనే నా భర్త’
రెండో కూతురు: ‘ఎంతమాట నాన్నా! నాభర్తా, పిల్లలూ అంతా నీతరవాతే”
మూడో కూతురు (అవివాహిత): నాభర్తా, సంతానంతోపాటు నిన్నుకూడా జీవితాంతం ప్రేమిస్తాను నాన్నా’
రాజుగారి అహందెబ్బతిన్నది. ఇంతలో సభలోనున్న పక్కరాజ్యం రాకుమారుడు “ రాజామీరు అనుమతిస్తే మీమూడో కుమార్తెను పెళ్ళాడుతాను”
లియర్ రాజు: ఎంత అదృష్టం. నన్ను ప్రేమించలేని కుమార్తె ఇంకా ఇక్కడెందుకు? సత్వరమే తీసుకెళ్ళి పెళ్ళిచేసుకో! మీరు భవిష్య్తత్తులో నన్ను చూడాల్సిన అవసరం లేదు”
రాజ్యాన్ని రెండుభాగాలుచేసి పెద్దకూతుళ్ళకు ఇచ్చేశాడు.
@@@@
కాలం గడిచింది. కూతుళ్ళిద్దరు రాజుగారు నాకొద్దు అంటే నాకు వద్దు అంటూ తరిమేశారు. వెంట విదూషకుణ్ణి తోడుంచుకొని రాజుగారు అడవులు పట్టుకొని తిరుగుతున్నాడు. సన్నివేశాల్ని తలచుకున్న రాజుకు దుఖః పొంగుకొచ్చింది. వర్షం మొదలైంది.
విదూషకుడు: రాజా! వర్షం ఎంత గొప్పది. మన కన్నీళ్ళను ప్రపంచానికి తెలియనివ్వదు. (‘మనసంతానువ్వే’ సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ (RIP) తో సునీల్ ఇదే డైలాగ్ చెబుతాడు)
పరిస్థితి తెలుసుకున్న మూడో కూతురు తండ్రిని వెదుక్కుంటూ వస్తుంది. ఆమె చేతిలో రాజు ప్రాణాలు విడుస్తాడు.
****
ఇక సౌదీకొద్దాం: తల్లిని ప్రేమించలేనివాణ్ణి నేనెలానమ్మగలను అంటుఓ యువతి భర్తనుండి విడాకులు కోరింది. నాఆకర్షణలో తల్లిని నిర్లక్ష్యం చేశాడు. అటువంటివాడు మరోఅమ్మాయి ఆకర్షణలో నన్ను నిర్ల్క్ష్యం చేయడని నమ్మకమేమిటి?ఆమె ప్రశ్న.
కోర్టు ఆమె వాదాన్ని ఒప్పుకొని విడాకులు మంజూరు చేసింది.
%%%%%
కుటుంబమనేది భార్యా పిల్లలకే పరిమితం కాదు. ఇది కుటుంబానికి కెంద్రం (కోర్), భర్త తలిదండ్రులు, భార్య తలిదండ్రులు, ఇద్దరి అన్నలు తమ్ముళ్ళు, అక్కలు, చెళ్ళెళ్ళు, వాళ్లపిల్లలు ఆకుటుంబ భావనకు పరిపూర్ణతను చేకూరుస్తారు. వీళ్ళందరి పోషణను భరించాల్సిన అవసరం లేదు. కష్టకాలాల్లో నేనున్నాను అనే ధైర్యాన్నీ, స్థైర్యాన్ని ఇవ్వడం ముఖ్యమ్.
నేను అభిమానించే పెద్దల్లో కొందరిని ఈ టప్పాకు టాగ్ చేశాను. ఇబ్బందిగా భావిస్తే అన్‌టాగ్ కావచ్చు. ముందస్తు ధన్యవాదములు.
ఆర్. రాజేశ్వర్ రావు
2018 లో తన పేస్ బుక్ వాల్ లో రాసిన సందే శాత్మక కథనం. కన్న తల్లిని ఆదరించలేని భర్త కు విడాకులిఛ్చిన ఓ ఓ సౌదీ మహిళ ఉదంతానికి ప్రేరణగా రాజేశ్వర్ రావు కథనం ఇది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box