రాష్ట్రం పై కేంద్రానిది ఎంతెంత ప్రేమ - అంతెందుకంటే..



 రాష్ట్రంపై కేంద్రానికి ఎంతెంత ప్రేమ--------అంతెందుకంటే....

తెలంగాణ కోటిరతనాలవీణ అని దాశరధి రాసిన మాటలు పుస్తకాలలో చదివినం. నాతెలంగాణ కోటి ఎకరాల మాగాణి అని కల్లముందు కదలాడిన నిన్నటి నిజం. కానీ ప్రస్తుతం తెలంగాణ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే  మనకు స్పష్టంగా అర్ధమయ్యే విషయం ఒకటే. రెండు జాతియ పార్టీలు మరియు ప్రధాన ప్రత్యర్ధులైనటువంటి బిజెపి, కాంగ్రెస్ లు కలిసి బిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయని.

ముఖ్యమైన కొన్ని విషయాలను పరిశీలిస్తె ముఖ్యంగా కల్వకుంట్ల కవిత అరెస్ట్ తో మొదలుకొని బండి సంజయ్ ని బిజేపి రాష్ట్ర అద్యక్ష పదవి నుండి తప్పిoచ్చేదాక అలా ప్రదేష్ కాంగ్రెస్ కమిటి రాష్ట్ర అద్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణ లొ బలపడే విదంగా బిజేపి చెసీందనేది ఎందుకో ఇప్పుడు బోదపడుతుంది. 

స్వయాన తెలంగాణ బిడ్డ స్వర్గీయ పి,వి నర్సింహారావు కాంగ్రెస్ ప్రదానమంత్రిగా వున్నప్పుడు కూడా ఇవ్వని కాజిపేట్ రైలు బోగీల తయారి కార్మాగారం బిజేపి ప్రభుత్వం ఇవ్వడం,  ట్రిపుల్ఆర్ కు అనుమతిచ్చి నిదులు సాంక్షన్ చేయడం,కెసిఆర్ ఎంత ప్రయత్నం చేసినా అనుమతివ్వని జూబ్లీ బస్ స్టేషన్ నుండి షామిర్పేట్ వరకు కంటోన్మెంట్ కారిడార్ ను రేవంత్ సర్కారుకు సాంక్షన్ చేయడం, ఎన్నడు లేనిది ప్రముఖ పారిశ్రామిక వేత్త మోది భక్తుడు అదాని వంద కోట్లు స్కిల్ డెవలప్మెంటుకోసం ఇవ్వడం, నిన్నగాక మొన్న తెలంగాణ కు పసుపుబోర్డు ను కెటాయించడాన్ని బట్టిచూస్తె దీనివెనక మతలబ్  ఒక్కటే: భారతీయ జనత పార్టి దక్షిణ భారత్ లో పాగవేసేందుకు పాండిచ్ఛేరి , చెన్నై, కేరళ మొదలగు రాష్ట్రాలలో పట్టు సాధించే పరిస్థితి లేనందున  చేజారిపోయిన కర్నాటకను మల్లీ సాదీంచుకోవాలి, రాష్ట్రాలను హస్తగతం చేసుకోవాలనేది బిజెపి పన్నాగం ఐనప్పటికి వెతుకుతున్న నక్లెస్ కాలికి తగిలినట్టు ఆంద్రాలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తెలంగాణ లో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెవంత్ రెడ్డిలు వీరిరువురు చంద్రబాబు ద్వార మోది కి దగ్గరగా వుండటం తెలిసీందే. రేవంత్ రెడ్డి రాజకియ ఓనమాలు నేర్చుకున్నది ఎబివిపి ఐనప్పటికి తనను తాను రాజకీయంగా ఆవిష్క రించు కోనేందుకు వివిద పార్టీలకు ప్రాతినిధ్యం వహీంచవచ్చు గాక ఆయన డిఎన్ఏ మాత్రం బిజేపి అనేది నిజం. దీనికి తోడు కాంగ్రెస్ సీనియర్స్ తొ సఖ్యత కుదరక కొమటిరెడ్డి వెంకట్ రెడ్డిలాంటి నాయకులు నాకు కూడా సి ఎం గా వుండే సామర్థ్యం వుందనడం పోంగులేటి రెండవ సి ఎం నేనే అని చెప్పటం ఈమద్య రిజిస్ట్రార్ అదికారులనుద్దేశించి మిడియా ముందు అవినీతి చేస్తున్నారని ఆరోపీంచటం తమ ప్రభుత్వాన్ని కానీ చులకన చేయడం  దురుద్దేశానికి నిదర్శనం. రాహుల్ గాంది ప్రకటిoచిన విధానాలు ఏవి ఒక్క కుల గణన మాత్రం తూతు మంత్రంగా చేసి మమ అనిపించింది రెవంత్ ప్రభుత్వం.

కాంగ్రెస్ హైకమాండ్ కు రేవంత్ నాయకత్వం పై నమ్మకం సడలుతున్నట్టు తెలుస్తున్నది. రేవంత్ ప్రచారం చేసిన మహరాష్ట్ర,హర్యాన ఎన్నికలలో కాంగ్రెస్ విఫలం అవడం కాంగ్రెస్ కూటమి డిల్లి పంజాబ్ లలో పొత్తులు విఫలం అవడండంతో  ఇండియా కుటమి దినదినం దిగజారుతుందనేది  వాస్తవం. రేవంత్ రెడ్డి బిజేపి  తొ జతకట్టి మరో శీండేగా ఉధ్భవీంచడం జరిగే అవకాశాలు లేకపోలేదు. వాస్తవానికి బిఆర్ఎస్ పార్టీకి ఒకసిద్దాంతం ఒక సెంటిమెంట్ వుంది. అంతకుమీంచి ఒకతాటిపై నడిపీంచే బలమైన నాయకుడు  సెంటిమెంట్ కు ఏ ఆటంకం వచ్చినా అస్తిత్వానికి హాని కలిగినా కాపాడగలిగే సత్తా ఉన్న నాయకుడు కెసిఆర్ ఉన్నాడు. ఇలాంటి శక్తివంతమైన పార్టీని కెసిఆర్ లాంటి మహానాయకుని ఆనవాల్లను తుడిచెయ్యాలంటె కాంగ్రెస్ కు నిత్య ప్రత్యర్ధిఐన బిజేపితో రేవంత్ కాంగ్రెస్ సర్కార్ లోపాయికారి తనానికి పాల్పడుతుందని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు,

దిక్కులేనోడొకడు సక్కిలేనోడొకడు కలుస్తె విడదియ్యలేని బందం ఏర్పడుతందన్న చందంగా  కాంగ్రెస్ బిజెపి ఈ రెండు పార్టీలు జట్టుకట్టి చక్రవ్యూహం రచీంచే కుట్రలోబాగమే. ఈ కెటిఆర్ పై ఈ కార్ రేస్ కేసు, ఈడి కేసు ఇలా అక్రమ కేసులు బనాయించి అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నది. రేవంత్ చంద్రబాబు సహచరుడైన పచ్చ మీడియ ఎబిఎన్ ఆంద్రజ్యోతి లో వరుస కథనాలు బిఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ గా అభివర్ణించి రాయడం బిజేపి, బిఆర్ఎస్ అంతర్గతంగా ఒక్కటేనని ప్రచారం చేయడాన్ని చూస్తే కాంగ్రెస్ బిజెపి లొపాయి కారి తనాన్ని బలపర్చినట్టేనని కనపడుతున్నది.

  మతాన్ని మత తత్వాన్ని ప్రజలలో బిన్నత్వంలో ఏకత్వంగా వున్న భారత దేశాన్ని మతాన్ని ఆపాదింపజేసీంది మత కలహాల సృష్టికి శ్రీకారం చుట్టీంది. రామజన్మభూమి అయోద్య శిలన్యాసితోనే నని ఈ సమయంలో మనం గుర్తుచేసుకోక తప్పదు. ఆ శిలన్యాసి జరిగీంది ప్రదాన మంత్రి గావున్న రాజీవ్ గాంది హాయంలోనె. బాబ్రి మసీదును కూల్చీంది ప్రదానమంత్రి పివి నర్సీంగారావు హాయంలోనే. ఇంత గొప్పచరిత్ర వున్న కాంగ్రెస్. బిఆర్ఎస్ ను బిఆర్ఎస్ఎస్ గ అభివర్నీంచటంలో ఆంతర్యమేమున్నదో ప్రజలు గమనిస్తున్నారు.

నిజానికి బిజెపి బిఆర్ఎస్ తొ రహస్య ఒప్పందం వుండివుంటె కెటిఆర్ విషయంలో ఈడి ఇంత ఫాస్ట్ గా ఎంటరై దర్యాప్తు మొదలుపెట్టేదా?.. కల్వకుంట్ల కవిత ను అరెస్ట్ చేసేవారు కాదు. ఐతె సైధాంతికంగా విరోదులే కావోచ్చు కాని తెలంగాణ లో మాత్రం బిఆర్ఎస్ పై కక్షసాధింపుకోసం వాల్ల స్వార్థ రాజకియ ప్రయోజనాలకోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. 

మహారాష్ట్ర షిండే ప్రయోగం ఇక్కడ జరిగేందుకు ఎక్కువ కాలం పట్టే అవకాశాలు కనబడటం లేదు. 


రామినేని ఫణి రాజారావు  

సిరిసిల్ల 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు