![]() |
డైరీ ఆవిష్కరణ |
పెన్షనర్స్ సమస్యలుప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషిచేస్తా -వరంగల్ ఎంపి కడియం కావ్య
పెన్షనర్స్ డే సందర్భంగా రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ పెన్షనర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
వరంగల్ ఉమ్మడిజిల్లా రిటైర్డ్ కాలేజిటీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పులిసారంగపాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపి కావ్య మాట్లాడుతూ
![]() |
ఎంపీ డాక్టర్ కావ్య ను సన్మానిస్తున్న రిటైర్డ్ అధ్యా పకురాళ్లు |
ప్రభుత్వ పెన్షనర్స్ ఎదుర్కుంటున్న సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.
సీనియర్ సిటిజెన్స్ సేవలు సలహాలు సూచనలు సమాజానికి ఎంతో అవసరమని వారి విజ్ఞానం భవిష్యత్ తరాలకు బంగారు గనులతో సమానమని ఆమె కొనియాడారు.
ఒక పుస్తకం చదివితే వందేళ్ల చరిత్ర తెలుస్తోందని వందేళ్ల జీవితాన్ని చూడాలంటే ఇలాంటి పెద్ద వాళ్ళ అనుభవం, వారు చెప్పే సూచనలు సలహాల ద్వారా నేర్చుకోవచ్చని తెలిపారు. ప్రతి సీనియర్ సిటిజన్ తన కుటుంబ సభ్యులని అందరిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీనియర్ సిటిజన్స్ కి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను ఎక్కడ ఎలాంటి ఆటంకం కలగకుండా అందరికీ లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
ఇప్పటికే వరంగల్ జిల్లాకు వెల్నెస్ సెంటర్ తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. దాదాపు 30 ఏళ్లుగా పెండింగ్ లో వరంగల్ జిల్లా సమస్యలను కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్కటిగా పరిష్కారించే దిశగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ జిల్లాను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేదిశగా 6వేల కోట్లు మంజూరు ఇచ్చారని చేశారు. సీనియర్ సిటిజన్ సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడు ముందుంటానని హమి ఇచ్చారు.విశ్రాంత అద్యాపకుల సంఘం శాశ్వత భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. తన ఎంపీ ఫండ్స్ నుండి గేమ్స్ సామాగ్రిని సమకూరుస్తానని వెల్లడించారు. అన్ని వర్గాల సహకారంతో రానున్న రోజుల్లో వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు.
రిటైర్డ్ కాలేజి టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సారంగపాణి మాట్లాడుతు పెన్షనర్ల సమస్యలు వివరించారు. తాత్కాలికంగా కొనసాగుతున్న అసోసియేషన్ భవనాన్ని శాశ్వత ప్రాతిపదికన కేటాయించాలని భవణ నిర్మాణంకోసం తోడ్పడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో AIFRUCTA (ఆలిండియా పెడరేషన్ అధ్యక్షులు) డాక్టర్ డిరమేష్, స్టేట్ ప్రెసిడెంట్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నెహ్రూ ప్రసాద్,ఉపాధ్యక్షులు డి సత్యనారాయణ రావు, వరంగల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ డి.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్స్ డేసందర్భంగా నిర్వహించిన వివిద క్రీడల్లో విజేతలకు బహుమతులు అందచేసారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box