సినిమాల సంక్రాంతి

 


*సినిమాల సంక్రాంతి..!*


పూర్వం..

అంటే..

మరీ క్రీస్తుపూర్వం కాదు..

ఈ స్పీడు రాని రోజుల్లో..

సినిమా టికెట్ 

రెండు.. అయిదు..

పది..ఇరవై ఉన్న రోజుల్లో

*ఎన్టీఆర్..ఏయెన్నార్ రాజుల్లో*

*కృష్ణ..శోభన్ యువరాజుల్లో..*

ఉండగా..

కనులు పండగా..

సంకురాతిరి పండగ..!


సంక్రాంతి సందేల

పెతివోడు తెల్లారే 

*దసరాబుల్లోడు* లా

తయారై..

*గుడిగంటలు* కొట్టేసి..

ఆనక *సోగ్గాడు* లా 

రోడ్డు మీద పడితే

*ఊరంతా సంక్రాంతి..*

ముందురోజు వేసిన *భోగిమంటలు* 

ఇంకా పొగలు కక్కుతుంటే..

పల్లెల్లో హరిదాసులు

_*రావమ్మా మహాలక్ష్మి*_

_*రావమ్మా*_ అంటూ రాగా

వేసిన బియ్యం *కృష్ణార్పణం*

అని స్వీకరిస్తుండగా..

*ఉండమ్మా బొట్టు పెడతా..*

పేరంటాళ్ళ సందళ్లు..

నిజానికి రైతన్న 

*పాడిపంటలు* బాగుండి

సంతోషంగా ఉంటేనే

నిజమైన *పండగ..!*


అన్నట్టు కుర్రకారు 

మరీ రెచ్చిపోయి

జూదం ఆడి

సొమ్ములు కోల్పోయి

ఇంటికెళ్తే

*కురుక్షేత్రం* తప్పదని

*పాండవవనవాసం*

చేసెయ్యడమే..

అందుకే ధర్మరాజులా

జూదమాడక

ఉన్న డబ్బులో కొంత

పేదోడికి ఇస్తే

వారేవా..ఊళ్ళో నువ్వేగా

*దానవీరశూరకర్ణ..!*


ఆ రోజులు చెల్లి

పండక్కి ఒకటో రెండో బొమ్మలు..

వాటిలో ఒకటి డబ్బింగ్..

సంప్రదాయం కరవై..

యాక్షన్ లేని ఫ్యాక్షన్..

మితిమీరిన హీరోయిజం..

అదే నేటి సినిమాల ఇజం..

ఇది నిజం..!

సినిమాల్లో ఎగిరే కార్లు..

టికెట్ ధర చుక్కల్లో షికార్లు..

ఆటకో ధర.. హీరోకో రేటు..

వాటిపై డిబేటు..

మొత్తానికి సినిమా ఇప్పుడు

కానే కాదు వినోదం..

అప్పుడప్పుడు విషాదం..

అదీ రాజకీయమే..

స్టార్ వార్..మొత్తంగా బోర్!


  *సురేష్ e..*

9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు