*_కూటమి కోటకు బీటలా..!?_*
*_స్కెచ్చా..తూఛా..!_*
ఎవరు ఎన్నన్నా ప్రస్తుతానికైతే
కూటమి ధర్మం నిరాఘాటంగా కొనసాగుతూ ఉంది.బాబు పవన్..ఆపై పవన్..లోకేష్
మధ్య సత్సంబంధాలు బాగా ఉన్నాయి.అయితే ఎక్కడో చిన్న నిప్పు.. అది కూటమిలో
పుట్టిందో..బయట శక్తులు రాజేస్తున్నాయో గాని లోకేష్ ఉప ముఖ్యమంత్రి అనే ఒక ప్రచారం ఊపిరిపోసుకోగా..
ఆ ప్రచారం జనసేనలో దుమారానికి దారి తీసిందని
హెవీ టాక్ నడుస్తోంది.ఇది ఎక్కడికి పోయి ఎక్కడికి దారి తీస్తుందనే విషయాన్ని ఇప్పటికి పక్కన బెడితే..
కొన్ని అంశాలనైతే ప్రస్తుతం చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడినట్టే..
కూటమి ప్రభుత్వంలో నానాటికి పవన్ కళ్యాణ్ పాపులారిటీ.. ప్రాధాన్యత
పెరిగిపోతోందన్నది నిస్సందేహం..
రాష్ట్రంలో ఇప్పుడు ఎవరికి
ఏ సమస్య ఉన్నా
ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తే పరిష్కారం అవుతుందనే లెవెల్లో పవన్ ఇమేజ్ పెరిగిపోయింది.
వ్యక్తిగత సమస్యలనే కాదు..
వివిధ రకాలైన సంఘాలలో కూడా డిప్యూటీ సిఎం దృష్టికి తీసుకు వెళ్ళాలి..ఎలాగైనా ఆయన్ని కలవాలి అనే బలమైన ఒక ఫీల్ జనాల్లో పెరిగిపోయింది.
మామూలుగా అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో..అది కూటమి సర్కార్ అయినా గాని ఇద్దరే పవర్ స్టార్స్ ఉంటారు.. ఒకరు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడైతే ఇంకొకరు ఆయన పుత్రరత్నం లోకేష్ బాబు..2014..19 మధ్య కూటమి ప్రభుత్వంలో బిజెపి ఉన్నా గాని తండ్రి కొడుకుల హవానే నడిచింది
అప్పుడప్పుడే ఊపిరి పోసుకున్న నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో..
ఇప్పుడు కొత్త పార్టీ వచ్చి కూటమిలో చేరింది ..ఇంకో పవర్ స్టార్ రాజకీయ అరంగేట్రం అనొద్దు గాని..
పవర్ హౌస్ లో వచ్చి చేరారు.
దాంతో కొత్త కథ మొదలైంది.
కూటమి ప్రభుత్వంలో..
రాష్ట్రంలో పవన్ ఇమేజి నానాటికీ పీక్స్ కి చేరుతోంది అనడంలో సందేహం
అవసరం లేదు.
తన తర్వాత..వారసుడు లోకేష్ బాబుని పెద్ద కుర్చీపై ప్రతిష్టించాలని బాబు ఆలోచన.. ఇది బహిరంగ రహస్యమే..తెలుగుదేశంలో అయితే బాబు నిర్ణయానికి ఎదురే ఉండదు.అసలు ప్రత్యామ్నాయమే
ఉండని పరిస్దితి..
బాబు పార్టీని..శ్రేణుల్ని
ఆ లెక్కలో ఉంచారు.
కాని పవన్ ఎంట్రీతో సీన్ మారుతోంది..పవన్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో..కూటమి సర్కారులో హీరోలా దూసుకు పోతున్నారన్నది నిర్వివాదం..
ఇదంతా బాబు గమనించని వ్యవహారమైతే కాదు. ఇలాంటివి గ్రహించడంలో నారా వారు నిష్ణాతులు. ఎప్పుడు ఎవరికి ఎలా కత్తెర వేయాలో గుర్తెరిగిన ఘటనా ఘట సమర్ధుడు ఆయన.అయితే ప్రస్తుత పరిస్థితితో డీల్ చెయ్యడం ఆయనకి కూడా అంత వీజీ కాదు.కూటమి ధర్మం..ఆపై
పవన్ కు పుష్కలంగా ఉన్న బిజెపి మద్దతు.. పైగా మోడీ ఆశీస్సులు ...
మరి కీలెరిగిన బాబు రానున్న రోజుల్లో పవన్ ప్రభంజనాన్ని
ఎలా టా"కిల్" చేస్తారో వేచి చూడాల్సిందే..ప్రస్తుతానికైతే అంతటి చంద్రబాబు కూడా
నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉన్నట్టే..
*_ఈఎస్కే..జర్నలిస్ట్_*
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box