*బహుళజాతి కంపెనీల లో కాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ లో ఎంపికయిన 17 మంది కిట్స్ వరంగల్ విద్యార్థులు*
*కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ సిల్వర్ జూబ్లీ (రజతోత్సవ) సెమినార్ హాల్ లో మంగళవారం ప్రాంగణ నియామకాలు జరిగాయి. ఇందులో 17 మంది వివిద కంపెనీలకు ఎంపికయ్యారు.*
* టాప్ మల్టీనేషనల్ ఐ టి ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ(PWC) అయిన ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌లో 4.25 లక్షల ప్యాకేజీ తో 5 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. PWC, $55.4 బిలియన్ల ఆదాయంతో, ప్రపంచంలోని 4 అతిపెద్ద అకౌంటింగ్ సంస్థలలో ఒకటి అని కిట్స్ ఛైర్మెన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు తెలిపారు.
BEL -భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 12 మంది విద్యార్థులు
3.65 లక్షల ప్యాకేజీ తో ఎంపికయ్యారు, ఇది భారత దేశ ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆద్వర్యం లో పని చేస్తున్నది
రాబోయే రోజుల్లో కిట్స్ ప్రాంగణ నియామకాల నిర్వహణకు సాంకేతిక ప్రపంచ దిగ్గజ యమ్. యన్. సి. కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని కోశాధికారి పి. నారాయణ రెడ్డి తెలిపారు.
విద్యార్థులు ఎల్లవేళలా తమ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నెమరు వేసుకుంటూ ఉద్యోగ సముపార్జన లో నిమగ్నము కావాలని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, చైర్మన్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (కిట్స్) మాట్లాడుతూ బి.టెక్. చివరి సంవత్సరం చదువుతున్న 17 మంది విద్యార్థినీ విద్యార్థులు బహుళజాతి కంపెనీ లో, సంవత్సరానికి 4.65 లక్షల ప్యాకేజీ శ్రేణిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఎంపికయ్యారన్నారు.
ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వారు వ్రాత పరీక్ష, టెక్నికల్ రౌండ్ & మౌఖిక ఇంటర్వ్యూ రౌండ్ లను 3 దశలలో నిర్వహించారు . ప్రస్తుత బి.టెక్. చివరి సంవత్సరం 2024-2025 బ్యాచ్ కి చెందిన సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సి యస్ యం, సి యస్ ఈ, సి యస్ యన్, సి యస్ ఓ, ఐ టి, ఈ సి ఈ, ఈ సి ఐ & ఈఈఈ వంటి 10 బ్రాంచ్ లకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు ఎంపిక అయ్యారni అని ప్రిన్సిపాల్ అశోక రెడ్డి తెలిపారు.
డీన్ ట్రైనింగ్ & ప్లేస్ మెంట్స్ ప్రొఫెసర్ వై. పురందర్, టి.పి.ఓ. డా. టి. చంద్రబాయి, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ ఇ. కిరణ్ కుమార్, వివిధ విభాగాల డీన్స్, విభాగాదిపతులు మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ & పిఆర్ఓ డాక్టర్ ప్రభాకరా చారి, ఆప్టిట్యూడ్ ట్రైనర్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జి. ధనుష్, డి శరత్, పి. సింధూర, పి. అరుణ కుమారి వివిధ విభాగాల హెడ్‌లు, అందరు డీన్‌లు, పలువురు బోధన, బోధనేతర సిబ్బంది ఎంపికైన 17 విద్యార్థుల కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box