ఆ గొంతులో ప్రేమాయణమూ-పురాణమే

 


*_ఆ గొంతులో ప్రేమాయణమూ_*

*_పురాణమే..!_*


🎼🎼🎼🎼🎼🎼🎼


ఆ గొంతులో మంత్రమే ఉందో

మహిమే దాగుందో..

మహత్తే ఇమిడిపోయిందో..

గమ్మత్తే నిండి 

నిభిడీకృతమైందో...

దేవగానమే ఆవిష్కృతమైందో..

మొత్తానికి ఆ గళం

*_స్వరరాగ గంగాప్రవాహం_*

_*గంధర్వుల ఆవాహం..!*_


_*రాముడికి రామదాసు*_

*_అయ్యప్పకి ఏసుదాసు_*

నగలు చేయించి నిలదీసాడేమో గోపన్న

పాటలు నీరాజనమిచ్చి

కరిగిపోయాడీ ఏసుదాసన్న..

ఆయన పాటే 

శబరిగిరీశుడికి సాపాటు

ఆ పాటే ఏడుమెట్ల 

అయ్యకు పవళింపు..

కోట్లాది భక్తులకు 

అయ్యప్ప లీలలపై ఆకళింపు..

*_ఆ గొంతే భక్తిపారవశ్యాల మేళవింపు..!_*


ఆయన ఆవేశం *మేఘసందేశం*

ఆ స్వరంలో విషాదం

*_గాలివానలో వాననీటిలో_*

*_పడవ ప్రయాణం.._*

ఉమాపతి లయ విన్యాసం

దళపతి నాట్య విలాసం..!


ఘంటసాల గొంతులో 

అందమైన టెక్నిక్

బాలు గళంలో 

హుషారెక్కించే పిక్నిక్

*_ఏసుదాసు కంఠంలో_*

*_మత్తెక్కించే మేజిక్.._*

ఆయన పాడితే

*_ముద్దబంతి పూలలో_*

*_మూగబాసలు..._*

*_మూసి ఉన్న రెప్పలపై_*

*_ప్రేమలేఖలు.._*

*_పంచుకునే మనసుంటే_*

_ప్రతి అభిమానికి_ 

*_మధుమాసమె_*

*_అవుతుంది ఎల్లవేళలా.._*

మూగకోయిల మురిసింది

మృధుమధురంగా..

ఈ గండుకోయిల 

_*పాడితే మనోహరంగా..!*_


ఎనిమిది పదులు

పైబడిన వయసు

గొంతుదేమో కుర్ర మనసు

హిందీలోనూ 

*_ఆజ్ సె పెహలే_*

*_ఆజ్ సె జాదా.._*

ఊపెయ్యలేదా..

ఒక్క చిత్ చోర్ తోనే

అయిపోలేదా 

జాతి మొత్తం ఫిదా..

ఒక తరం గాయకుల 

నాయకుడు జేసుదాసు..

ఎన్నో తరాల భక్తులకు

అనురక్తుడు 

*_ఈ అయ్యప్పదాసు.._*

మతాన్ని మించి

అభిమతాన్ని గెలిచి

సమ్మతంగా నిలిచి

గానమాధుర్యంతో

దేవుడినే భువిపైకి దించి

ఇలపై మెరిసి మురిసి

పాటల తోటలో

విరిసిన గంధర్వుడు

ఏసుదాసు..

_*అయ్యప్పకు పురంధరదాసు..*_

మన పాలి 

*మరో కబీర్ దాసు..!*


గంధర్వ గాయకుడు

కె జె ఏసుదాస్ కు

జన్మదిన శుభాకాంక్షలతో..                                             *_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

      9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు