*కిట్స్ వరంగల్ లో " "డేటా స్ట్రక్చర్స్ త్రూ సి" అనే అంశంపై రెండు వారాల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ "(యఫ్ డి పి) ముగింపు*
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (నెట్‌వర్క్స్- సిఎస్‌ఎన్), కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో సిస్కో ల్యాబ్ కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో జరిగిన "డేటా స్ట్రక్చర్స్ త్రూ సి"పై రెండు వారాల ఆఫ్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ( యఫ్ డి పి ) ముగింపు వేడుక శనివారం నిర్వహించారు.
జనవరి 2 నుండి 11, 2025 వరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు.
ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్‌లో ప్రాథమిక అంశాలు కంప్యూటర్యేతర సైన్స్ స్ట్రీమ్‌ల అధ్యాపకుల బోధనా పద్దతులు మరియు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి రూపొందించబడింది అని, వాటిలో ఒకదానిని సమర్థవంతంగా బోధించడానికి అత్యాధునిక సాంకేతికతలతో వారికి సన్నద్ధం చేయబడిందని
డాక్టర్ కె వేణు మాధవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలోసిఎస్‌ఎన్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ వి శంకర్‌తో కలిసి డాక్టర్ కె వేణు మాధవ్ డీన్ అకడమిక్ అఫైర్స్, ఎఫ్‌డిపి కోఆర్డినేటర్లు, సిఎస్‌ఎన్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.బి.శ్రీధర్ మూర్తి, డా.బి.వి.ప్రణయ్ కుమార్, డా.వి.చంద్రశేఖర్ రావు, డా.ఎస్.వెంకట్రాములు, డా.వి.స్వాతి, వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల అధిపతులు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ & పి ఆర్ ఓ డా. డి. ప్రభాకరా చారి, మరియు 40 మంది ఇంజనీరింగ్ అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు, కిట్స్ వరంగల్ ఛైర్మన్ కెప్టెన్ వి. ల క్ష్మికాంతా రావు, కిట్స్ వరంగల్ కోశాధికారి పి.నారాయణరెడ్డి & హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు కిట్స్ అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్ కిట్స్ వరంగల్ నెట్‌వర్క్స్ అధ్యాపక బృందాన్ని ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ల ని ఈ రెండు వారాల ప్రొగ్రాం నీ విజయ వంతం చేసినందుకు అభినందించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box