నాగేశ్వర్ రావు మడుగురికి ఉత్తమ సేవ అవార్డు





ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ, ములుగు జిల్లా కన్వీనర్

నాగేశ్వరరావు మడుగురి  76 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉద్యోగిగా  అవార్డు అందుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ దనసర అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ దివాకర  టిఎస్ అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు చేతుల మీదుగా సేవ పత్రం అందుకున్నారు.


నాగేశ్వర్ రావు ఎస్సి కార్పొరేషన్ శాఖలో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలకు గాను జిల్లా స్థాయి లో ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందుకున్నందుకు పలువురు అభినందనలు తెలిపారు.

ఈ సందర్బంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఉత్తమ సేవ అవార్డు అందజేసిన మంత్రి వర్యులు ధన సరి అనసూర్య (సీతక్క) జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ సంపత్ రావు లకు కృతఙ్ఞతలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు