బి సి ఇంటలెక్చువల్స్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ గా డాక్టర్ కొంగ వీరస్వామి

 


బి సి ఇంటలెక్చువల్స్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ గా డాక్టర్ కొంగ వీరస్వామి 


      బి.సి ఇంటలెక్చువల్స్ ఫోరం వరంగల్ ఉమ్మడి జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ గా హనుమకొండకు చెందిన డాక్టర్ కొంగ వీరస్వామిని నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ రిటైర్డ్ ఐఎఎస్ టి చిరంజీవులు నియామక పత్రాన్ని అందించారు. మంగళవారం హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వీరాస్వామితో పాటు వివిధ రంగాలకు చెందిన వారిని కో ఆర్డినేటర్లుగా నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ చిరంజీవులు మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 77 ఏండ్లు అయినా 60 శాతం పైగా ఉన్న బి.సి లు అభివృద్ధికి నోచుకోలేని దుస్థితిలో జరుగుతున్న బి.సి ఉద్యమాలకు దిశ దశ చూపెట్టడానికి బి.సి సమాజం నుండి ఎదిగిన ఇంటలెక్చువల్స్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 100 కు పైగా ఉన్న బి.సి కుల, ప్రజా సంఘాలను ఒకే కూటమిగా ఏర్పాటు చేయడానికి బి.సి ఇంటలెక్చువల్స్ ఫోరం కృషి చేస్తుందని ఆయన అన్నారు. 

   చీఫ్ కోఆర్డినేటర్ గా నియమితులైన డాక్టర్ కొంగ వీరస్వామి మాట్లాడుతూ సామాజిక ఉద్యమాల్లో గత 30 ఏండ్లుగా కొనసాగుతున్న నాపై నమ్మకంతో ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించిన చిరంజీవులు, నా నియామకానికి సహకరించిన రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాతో పాటు నియమింపబడిన కోఆర్డినేటర్లు డాక్టర్ సి హెచ్ రాములు, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, డాక్టర్ కొణతం కృష్ణ, డాక్టర్ సూత్రపు అనిల్, డాక్టర్ చంద మల్లయ్య, డాక్టర్ కె సూర్య కిరణ్, మండల పరుషరాములు, న్యాయవాది రాచకొండ ప్రవీణ్, ధర్మపురి రాజగోవింద్, కొలిపాక ప్రకాష్, పెండెల సంపత్ లతో కలిసి బి.సి ఉద్యకారులతో పాటు సామాన్య ప్రజలను చైతన్యం చేయడంలో కీలకపాత్ర పోషిస్తామని అన్నారు. బి.సి సమాజ తాత్కాలిక సమస్యలపై పోరాటం చేస్తూనే అంతిమ లక్ష్యమైన రాజ్యాధికారం కోసం ముందుకు సాగుతామని అన్నారు. స్థానిక సంస్థల్లో బి.సి లు అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేదుకు  ఇంటలెక్చువల్స్ ఫోరం కృషి చేస్తుందని అన్నారు. 

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చామకూర రాజు, అశోక్ గౌడ్, డాక్టర్ అవ్వారు వేణు కుమార్, న్యాయవాది కొమరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు