కామ్రేడ్ దామోదర్ మరణం బూటకం అంటూ జరుగుతున్న ప్రచారంపై జంపన్న విశ్లేషణ
16వ తేదీ బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్ గ్రామం వద్ద ప్రభుత్వ పోలీసు బలగాలకు మావోయిస్టు గెరిల్లా బలగాలకు జరిగిన యుద్ధంలో మావోయిస్టు పార్టీకి చెందిన 18 మంది చనిపోయినట్టుగా అందులో తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ దామోదర్ చనిపోయినట్టుగా మావోయిస్టు పార్టీ 18వ తేదీన ప్రకటించింది . దీని పై పోలీసు అధికారులు నిర్ధారించడం లేదు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతులలో దామోదర్ లేకపోవడం , పోలీసుల నిర్ధారణ లేకపోవడం కారణంగా దామోదర్ చనిపోయిండు అనే ప్రచారం బూటకమైనదంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి మావోయిస్టు పార్టీ ప్రకటన ప్రభుత్వ కుట్ర ప్రచారంలో భాగంగా చేయబడిందని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
మావోయిస్టు పార్టీ 18 వ తారీకు ప్రకటించిన వార్తను లోతుగా విశ్లేషిస్తే ఆ ప్రకటనను అనుమానించడానికి ఎలాంటి అవకాశం లేదు. చత్తీస్గడ్ పోలీసు అధికారులు ప్రకటించినట్టుగా 12 మంది మావోయిస్టులు చనిపోయినారు అనేదానికి భిన్నంగా 18 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా ,అందులో రాష్ట్ర కమిటీ మెంబర్ దామోదర్ తో పాటు ప్లాటూన్ పార్టీ కమిటీ( పిపిసి)మెంబర్స్ , ఇతర పార్టీ సభ్యులు ,సాధారణ ప్రజలు ఐదుగురు చనిపోయినట్టుగా ప్రకటించినారు. ఆ ప్రకటనలో 5000 మంది ప్రభుత్వ బలగాలు దాడి చేసినట్టుగా వారి దాడిలో శత్రు దేశాలపై ఉపయోగించే మిస్సైల్స్ ప్రయోగించినారని, మావోయిస్టు గెరిల్లాలు జరిపిన వీరోచిత ప్రతిఘటనలో ఐదుగురు పోలీసులు చనిపోవడమే కాకుండా డజన్ల సంఖ్యలో పోలీసులు గాయపడ్డారని చెప్పిన విషయాలను గమనిస్తే ప్రభుత్వం అబద్ధం ప్రచారంగా భావించలేము.
మావోయిస్టు పార్టీ పేరుతో వచ్చిన ప్రకటన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే. పోలీసు అధికారులు ప్రకటించినట్టుగా మావోయిస్టులు 12 మంది కాకుండా 18 మంది ప్రకటించినరానే మావోయిస్టు ప్రకటన ప్రకారంగా మరో ఆరుగురి మృతదేహాలు పోలీసులకు స్వాధీనం కాలేదు. బహుశా దామోదర్ తో పాటుగా ఆరుగురు గాయపడి రిట్రీట్ అయ్యే క్రమంలో చనిపోవడం గాని, లేదా అక్కడే చనిపోతే వారి సహచరులు మృతదేహాలను తీసుకపోవడం గాని జరిగి ఉండవచ్చు. ఈ కారణం రీత్యా దామోదర్ తో పాటుగా మరో ఆరుగురు చనిపోయిన విషయాన్ని పోలీసు అధికారులు నిర్ధారణ ప్రకటన చేయలేరు. అయితే మావోయిస్టులు ప్రకటించిన విధంగా మిస్సైల్స్ ఉపయోగించిన విషయం కానీ , ప్రజలపై విచ్చలవిడి కాల్పులతో చంపడం, వివిధ వాహనాలను ధ్వంసం చేయడం, పోలీసు బలగాలు చనిపోయినట్టుగా గాయపడిన విషయాలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమైనవి. ప్రభుత్వ వ్యతిరేకమైన విషయాలను పోలీసు అధికారులు ధ్రువీకరించలేరు.
పై విశ్లేషణ ప్రకారంగా మావోయిస్టు పార్టీ ప్రకటన బూటకమైనదిగా కాకుండా వాస్తవమైనదిగా భావించడమే సరైనదిగా గుర్తించవలసి ఉంటుంది.
ప్రజా వీరుల త్యాగం ఉన్నతమైనది. శ్రామిక వర్గ రాజ్య స్థాపన శాశ్వతమైనది.
జంపన్న
( మార్క్సిస్టు లెనినిస్ట్ రచయిత )
జనవరి 19 2025.
(జంపన్న ఫేస్ బుక్ వాల్ )
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box