ఆంధ్రప్రదేశ్‌లో సైన్సు టీచర్ ను విద్యార్థులు కొట్టి చంపిన విశాధ సంఘటన జరగగా మధ్యప్రదేశ్‌లో ఏకంగా తుపాకీతో కాల్చి చంపిన వికృత సంఘటన జరిగింది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ పాఠశాలలో సైన్స్ టీచర్ ఎజాస్ అహ్మద్ పై విద్యార్థులు మూకుమ్మడిగా దాడిచేసి పిడిగుద్దులు గుద్దారు. ఆదెబ్బలకు ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడి సొమ్మసిల్లి ఆతర్వాత చనిపోయాడు. కొద్ది రోజుల కిందట పిల్లలను సరిగా నడుచుకోమని చెప్పడమే ఆయన చేసిన నేరమైంది. ఉపాధ్యాయుడు ఎజాస్‌పై విద్యార్థులు ద్వేషం పెంచుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎజాస్‌పై ఒక్కసారిగా విద్యార్థులు విరుచుకుపడి పక్కా ప్లాన్ తో తీవ్రంగా కొట్టి చనిపోయేందుకు కారకులయ్యారు.
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో పట్టపగలే పాఠశాలలో ప్రిన్సిపల్‌ను స్టూడెంట్ కాల్చి చంపాడు. స్కూల్లో క్లాసులు జరుగుతున్న సమయంలో.. ప్రిన్సిపల్ వాష్‌రూంకు వెళ్తుండగా గమనించిన ఆ స్టూడెంట్ వెనకాలే వెళ్లాడు. తీరా బాత్రూంలోకి వెళ్లిన తర్వాత తాను తీసుకువచ్చిన తుపాకీతో ప్రిన్సిపల్‌పై పాయింట్ బ్లాక్ రేంజిల కాల్పులు జరిపాడు. ఆ ప్రిన్సిపల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి రక్తపుమడుగులో విలవిలలాడాడు. కాల్పుల శబ్దం విన్న స్కూల్ సిబ్బంది, టీచర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి బాత్రూంలో చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రిన్సిపల్‌ను చూసి షాక్ అయ్యారు. ప్రిన్సిపల్‌ను కాల్చి చంపిన తర్వాత ఆ విద్యార్థి మరో విద్యార్థి బైక్ ఎక్కి అక్కడి నుండి ఫరారయ్యాడు.
ఈ కాల్పుల శబ్దానికి స్కూల్‌లోని టీచర్లు, స్టూడెంట్స్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరుగు పరుగున బాత్రూంకు వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడి చనిపోయిన ప్రిన్సిపాల్‌ను చూశారు. ఈ సమాచారం పోలీసులకు అందించగా.. వారు హుటాహుటిన ఆ స్కూల్‌కు చేరుకుని.. సురేంద్ర కుమార్ సక్సేనా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
----
పై రెండుసంఘటనలు సభ్యసమాజాన్ని సవాల్ చేస్తున్నాయి. గురువు దైవంతోసమానం. సమాజానికి మార్గ నిర్దేశికులుగా భావించే ఉపాధ్యాయులపట్ల విద్యార్థులు ఇంతగా పగప్రతీకారం పెంచుకుని హత మార్చేందుకు సైతం ఒడిగట్టడం ఆందోళన కలిగిస్తోంది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box