రవీంద్రభారతిలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం
చాలా మంది సిద్ధాంతాలు చెబుతారు... కానీ పాటించే వారు మాత్రం కొద్దిమందే ఉంటారు....
అలాంటి వారిలో యాదవరెడ్డి గారు ఒకరు.. నమ్మిన సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తి ఆయన.
సురవరం లాంటి వారు హార్డ్ కోర్ కమ్యూనిస్టులు అయితే... జైపాల్ రెడ్డి, యాదవ రెడ్డి లాంటి వారు సాఫ్ట్ కోర్ కమ్యూనిస్టులు.
దేశంలో పేదలకు అభివృద్ధి ఫలాలను అందించేందుకు వారు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు..
పదవుల కోసం కాకుండా... సిద్ధాంతాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారు పని చేశారు.
తెలంగాణ ఉద్యమంలోనూ యాదవరెడ్డి గారి కృషి ఎన్టీజో ఉంది...
తెలంగాణ కోసం తెర వెనుక కృషి చేసిన వారిలో ఆయన ఒకరు.
తెలంగాణ కోసం సోనియాగాంధీ గారు చర్చించిన సమయంలో ఆయన కూడా తెలంగాణ ఆవశ్యకతను సోనియాకు వివరించారు.
తెలంగాణ బిల్లును ఆమోదించించడంలో జైపాల్ రెడ్డితో పాటు యాదవ రెడ్డి గారు తన బాధ్యత నిర్వహించారు.
ముల్కీ- నాన్ ముల్కీ నుంచి, తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు సంపూర్ణ వివరాలతో ఒక పుస్తకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది.
భవిష్యత్ తరాలకు తెలంగాణ ఉద్యమ పరిణామ క్రమాలను వివరిస్తూ తెలంగాణ ఉద్యమం చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరుతున్నా.
ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారి గురించి కూడా ఆ పుస్తకంలో వివరించాల్సిన అవసరం ఉంది..
అలాంటి పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నా..
2014 తరువాత దాదాపు 2వేల నుంచి 4వేల చదరపు కి.మీ వరకు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది.
దీనిపై చర్చ చేసేందుకు పాలకులకు ధైర్యం లేదు.. చర్చించే వారు అసలే లేరు..
మణిపూర్ లో జరుగుతున్న మారణకాండకు కారణం అక్కడ అధునాతన ఆయుధాలు...
ఖనిజ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ సంస్థలు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
మన దేశంలో రెండు గిరిజన జాతులు ఎదురుపడుతే అధునాతన ఆయుధాలతో ఊచకోత కోసుకునే పరిస్థితి ఏర్పడింది.
భారత బలగాలు మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలెవా?... తలచుకుంటే అక్కడి ఆయుధాలను సీజ్ చేయలేరా?
దేశంలో నెలకొన్న భయానక వాతావరణంపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది..
దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై కూడా చర్చ జరగాలి...
చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలి, వాటిని నియంత్రించాలి..
అప్పుడే దేశంలో శాంతి నెలకొల్పబడుతుంది..
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box